మహిళా కమిషన్‌ ఎదుట హాజరు కానందుకు చంద్రబాబుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం – చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ

AP Vasireddy Padma Responds Over Chandrababu For Not Attending at Women's Commission, Vasireddy Padma Responds Over Chandrababu For Not Attending at Women's Commission, AP Vasireddy Padma, Women's Commission, Chandrababu For Not Attending at Women's Commission, AP Women's Commission Issues Summons TDP Chief Nara Chandrababu Naidu, AP Women's Commission issues summons to NCBN, AP Women's Commission had issues summons to Nara Chandrababu Naidu to appear before the commission on April 27, AP Women's Commission has issued summons to Chandrababu and Bonda Uma to appear For Enquiry on April 27, AP Women's Commission Summons Issued To Nara Chandrababu Naidu, Summons Issued To Nara Chandrababu Naidu, Nara Chandrababu Naidu, TDP Women Wing Protest News, TDP Women Wing Protest Latest News, TDP Women Wing Protest Latest Updates, TDP Women Wing Protest Live Updates, TDP Women Wing Protest At Mangalagiri, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్ విజయవాడ)లో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించటానికి వచ్చిన సందర్భంలో టీడీపీ నేతలకు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మధ్య వివాదం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఏప్రిల్ 27వ తేదీన వివరణ ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బోండా ఉమాలకు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ నేటి విచారణకు హాజరు కాలేదు.

అయితే.. మహిళా కమిషన్‌కు చంద్రబాబు హాజరు కాకపోవడంపై వాసిరెడ్డి పద్మ స్పందించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడుపై త్వరలోనే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. మహిళా కమిషన్‌ను చంద్రబాబు గౌరవిస్తారని అందరూ అనుకున్నారని.. కానీ ఆయనే ఇలా ప్రవర్తించటం దారుణమన్నారు. కమిషన్ ముందు హాజరు కాకపోవడమే కాకుండా ధర్నాలకు పిలుపునివ్వడం, మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు నాయుడు, బోండా ఉమ కమిషన్‌కు హాజరుకాని విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టమని, ఈ అంశంపై న్యాయశాఖతో చర్చించి, తదనంతర చర్యలు తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 8 =