రేపు అస్సాం, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన

2021 West Bengal Assembly Elections, Mango News, modi, Modi to Visit Assam and West Bengal, pm narendra modi, PM Narendra Modi to Visit Assam, PM Narendra Modi to Visit Assam and West Bengal States, West Bengal, West Bengal Assembly Elections, West Bengal Assembly Elections 2021, West Bengal Elections, West Bengal Elections 2021, West Bengal States

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 22, సోమవారంం) పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా రేపు ఉద‌యం 11.30 గంట‌ల‌కు అస్సాంలో ఇండియ‌న్ ఆయిల్ బొంగైగామ్ రిఫైన‌రీలో ఇండ్ మాక్స్ యూనిట్‌ను జాతికి అంకితం చేయ‌నున్నారు. అలాగే ధెమాజిలోని ప్ర‌భుత్వ ఇంజినీరింగ్ కాలేజీని ప్రారంభించనున్నారు. అనంతరం సుయాల్‌కుచి ఇంజినీరింగ్ కాలేజీకి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ కార్యక్రమాలలో అస్సాం గ‌వ‌ర్న‌ర్ జగదీష్ ముఖి‌, అస్సాం ముఖ్య‌మంత్రి సర్బానంద సోనోవాల్, కేంద్ర పెట్రోలియం స‌హ‌జ‌వాయు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన‌నున్నారు.

అనంతరం పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చేరుకొని సాయంత్రం 4:30 గంటలకు ప‌శ్చిమ‌బెంగాల్ ‌లోని నోవాపారా నుంచి ద‌క్షిణేశ్వ‌ర్‌కు మెట్రొరైలు మార్గ పొడిగింపును ప్రారంభిస్తారు. అలాగే ఈ మార్గంలొ తొలి రైలు స‌ర్వీసును జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం సౌత్ ఈస్టర్న్ రైల్వే కు చెందిన ఖ‌ర‌గ్‌పూర్-ఆదిత్య‌పూర్ 132 కిలోమీట‌ర్ల మార్గంలో 30 కిలోమీట‌ర్ల పొడ‌వున ఉండే క‌లైకుంద‌, జార్‌గ్రామ్‌ మ‌ధ్య మూడో రైల్వే లైన్ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించ‌నున్నారు. ఇవేగాక పశ్చిమబెంగాల్ లో మరికొన్ని రైల్వే మార్గాలకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయ‌నున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − two =