అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ

Former Sri Lanka captain Lasith Malinga retires, Lanka fast bowler Malinga announces retirement, Lasith Malinga announces retirement, Lasith Malinga announces retirement from all formats, Lasith Malinga Announces Retirement from All Forms of Cricket, Lasith Malinga Retires From All Forms Of Cricket, Mango News, Sri Lanka Fast Bowler Lasith Malinga, Sri Lanka Fast Bowler Lasith Malinga Announces Retirement, Sri Lanka Fast Bowler Lasith Malinga Announces Retirement from All Forms of Cricket, Sri Lanka great Lasith Malinga retires

శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ఇస్తున్నట్లుగా మంగళవారం నాడు ట్విట్టర్ లో లసిత్ మలింగ ప్రకటన చేశాడు. యార్కర్లు, వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి జట్టు సభ్యులను ముప్పు తిప్పలు పెట్టే మలింగ ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కు, వన్డేలకి వీడ్కోలు చెప్పగా, తాజాగా టీ20 క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలుకుతున్నట్టు తెలిపాడు. శ్రీలంక తరుపున 84 టీ20 మ్యాచ్ లు ఆడి 107 వికెట్లు పడగొట్టాడు. అలాగే మలింగ కెప్టెన్సీలో శ్రీలంక జట్టు 2014లో టీ20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది.

మరోవైపు మలింగ తన కెరీర్లో 30 టెస్టులు ఆడి, 33.16 సగటుతో 101 వికెట్లు పడగొట్టాడు. ఇక 226 వన్డేల్లో 28.87సగటుతో 338 వికెట్లు పడగొట్టాడు. 2007, 2011 క్రికెట్ ప్రపంచ కప్ లో శ్రీలంక జట్టు ఫైనల్ చేరడంలో మలింగ కీలక పాత్ర పోషించాడు. తన అంతర్జాతీయ కెరీర్ లో మొత్తం 546 వికెట్లు సాధించాడు. తన కెరీర్లో 6/38 తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసాడు. తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ మలింగ ధన్యవాదాలు తెలిపాడు. రాబోయే సంవత్సరాల్లో యువ క్రికెటర్లతో తన అనుభవాన్ని పంచుకోవడానికి ఎదురుచూస్తున్నానని లసిత్ మలింగ పేర్కొన్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =