ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 7, గురువారం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వారణాసిలోని ఎల్టి కళాశాలలో దాదాపు లక్ష మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వండే సామర్థ్యం గల అక్షయ పాత్ర మిడ్ డే మీల్ కిచెన్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2:45 గంటలకు ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్-రుద్రాక్ష్‌ను ప్రధాని మోదీ సందర్శించి, అక్కడ జాతీయ విద్యా విధానం అమలుపై అఖిల భారతీయ శిక్షా సమాగాన్ని ప్రారంభించనున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ సిగ్రాలోని డాక్టర్ సంపూర్ణానంద్ స్పోర్ట్స్ స్టేడియంకు చేరుకుని, అక్కడ జరిగే సభ నుంచి రూ.1800 కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేయనున్నారు. వారణాసి నగరంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సామాన్యులకు జీవన సౌలభ్యాన్ని పెంపొందించడంపై ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయని తెలిపారు.
గత ఎనిమిదేళ్లుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. దీంతో వారణాసి నగర రూపురేఖలు మారిపోయాయని, ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంపొందించడం జరిగిందని తెలిపారు. ఈ దిశలో మరో అడుగు వేస్తూ గురువారం రూ.1800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ఇక ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్-రుద్రాక్ష్ వద్ద కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో అఖిల్ భారతీయ శిక్షా సమాగం జులై 7 నుంచి 9వ తేదీ వరకు జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాతీయ విద్యా విధానం- 2020 యొక్క సమర్థవంతమైన అమలు కోసం రోడ్‌మ్యాప్‌ను చర్చించడానికి ప్రముఖ విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు తమ ఆలోచనలను, అనుభవాలను పంచుకోనున్నారని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY