పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు

India PM Narendra Modi’s 71st birthday, India PM Narendra Modi’s 71st birthday today, India PM Narendra Modi’s birthday, Mango News, Narendra Modi Birthday, Narendra Modi Birthday LIVE Updates, Narendra Modi Birthday Updates, PM Modi turns 71, PM Narendra Modi Birthday, PM Narendra Modi Birthday Wishes, PM Narendra Modi Turns 71, Political Leaders and Celebrities Extend Birthday Wishes, Prime Minister Modi’s birthday, Prime Minister Modi’s birthday live

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు 71 వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీకి పెద్దఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రధాని మోదీ 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 7 తేదీ వరకు 20 రోజుల పాటుగా పలు కార్యక్రమాలను చేపట్టేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా “సేవా ఔర్ సమర్పణ్ అభియాన్” పేరుతో ఈ కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టనుంది.

ఈ కార్యక్రమం ద్వారా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు, నదీలను శుభ్రం చేసే కార్యక్రమాలు, ఖాదీ మరియు స్థానిక ఉత్పత్తులను ఉపయోగించమని ప్రజలను ప్రోత్సహించడం సహా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ రోజు అత్యధిక సంఖ్యలో కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు అందించి, రికార్డును నమోదు చేయడం ద్వారా ప్రధాని మోదీ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని బీజేపీ యోచిస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో పెద్దఎత్తున కోవిడ్-19 వ్యాక్సినేషన్ జరిపేందుకు ఏర్పాట్లు చేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + two =