భారతీయ ప్రముఖ సినీ గాయకుడు ‘కేకే’ హఠాన్మరణం.. సంతాంపం తెలిపిన ప్రధాని మోదీ

Indian Famous Singer KK Passes Away After Performing a Concert at Kolkata PM Modi Pays Tribute, Indian Famous Singer KK Passes Away After Performing a Concert at Kolkata, Singer KK Passes Away After Performing a Concert at Kolkata, KK Indian Famous Singer Passes Away After Performing a Concert at Kolkata, PM Modi Pays Tribute To Indian Famous Singer KK, Modi Pays Tribute To Indian Famous Singer KK, Indian Famous Singer KK, Famous Singer KK, Concert at Kolkata, Famous Singer KK Passes Away, Famous Singer KK Passed Away, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

భారతీయ ప్రముఖ సినీ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ (కేకే) మంగళవారం రాత్రి కోల్​కతా ప్రదర్శన తర్వాత​ గుండెపోటుతో కన్నుమూశారు. ఈ వార్త సినీ ప్రపంచంతో పాటు ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. దక్షిణ కోల్‌కతాలోని నజ్రుల్ మంచ్‌లో ఒక ప్రదర్శన ఇస్తున్నప్పుడు కేకే కొంత అస్వస్థతకు గురయ్యారు. ప్రోగ్రాం అనంతరం ఆయన హోటల్ రూమ్ కి చేరుకున్నారు. అయితే మరోసారి అస్వస్థతతో కుప్పకూలి పోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. బహుముఖ గాయకుడిగా ప్రసిద్ధి చెందిన ‘కేకే’ కేవలం 53 సంవత్సరాల వయస్సులోనే కన్నుమూయటం విషాదం. కాగా ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. కేకే 1991లో జ్యోతిని వివాహం చేసుకున్నారు. ఆయన కొడుకు నకుల్ కృష్ణ కున్నాథ్​ కూడా మంచి సింగర్ గా పేరు తెచ్చుకున్నారు​.

కాగా కేకే ఆకస్మిక మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేకే మృతి భరతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘కేకే పాటలు అనేక రకాల భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి. అన్ని వయసుల వారిని అలరిస్తాయి. ఆయన పాటల ద్వారా మనం కేకేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’ అని తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేకే మరణ వార్తపై స్పందించారు. కేకే మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా కేకే మృతి పట్ల ఆయన కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు. కేకే మరణవార్త తెలిసిన భారతీయ సినీ పరిశ్రమలోని ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

మలయాళీ దంపతులైన సీఎస్​ మీనన్​, కున్నాథ్​ కనకవల్లిలకు 1968 ఆగష్టు 23న జన్మించారు కేకే. గ్రాడ్యుయేషన్​ పూర్తయ్యాక కొన్ని రోజులపాటు ఒక ప్రైవేట్ సంస్థలో మార్కెటింగ్​ ఎగ్జిక్యూటివ్​గా జాబ్​ చేసిన అనంతరం తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముంబై వచ్చారు. తొలుత అడ్వర్టైజ్మెంట్​ జింగిల్స్​తో సింగింగ్​ కెరీర్​ ప్రారంభించిన కేకే, దాదాపు పదకొండు భాషల్లో 3,500 యాడ్స్​కు వాయిస్​ ఇచ్చారు. 1994లో యూటీవీ వారి సింగ్​ జింగిల్స్​తో ఆయనకు బ్రేక్​ వచ్చింది. 1996లో వచ్చిన కాదల్​ దేశం (తెలుగులో.. ప్రేమ దేశం) సినిమాలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్​ రెహమాన్ సంగీత సారధ్యంలో ఆయన పాడిన.. హలో డాక్టర్​, కల్లూరి సాలే (కాలేజీ స్టయిలే) పాటలతో దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది. ప్రత్యేకించి విషాద గీతాలకు కేకే పెట్టింది పేరు. తెలుగులో ఎన్నో హిట్ పాటలను ఆలపించారు కేకే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలో కేకే పాడిన కొన్ని పాటలు ఆల్ టైమ్ హిట్ గా నిలిచాయి. యే మేరా జహా (ఖుషీ), నాలో నువ్వొక సగమై (జానీ), లే లే లేలే (గుడుంబా శంకర్​), ఇంతే ఇంతింతే.. (బాలు), మై హార్ట్ ఈజ్​ బీటింగ్​(జల్సా) వంటివి మచ్చుకు కొన్ని. అలాగే దాయి దాయి దామ్మా (ఇంద్ర), ఫీల్​ మై లవ్, ఉప్పెనంత ఈ ప్రేమకు ​(ఆర్య), ఎవ్వరినెప్పుడు తన వలలో (మనసంతా నువ్వే), నీ కోసమే నా అన్వేషణ (నువ్వు నేను), ప్రేమ ప్రేమ నీకు ఇది న్యాయమా (జయం), చెలియ చెలియా..(ఘర్షణ), గుర్తుకొస్తున్నాయి..(నా ఆటోగ్రాఫ్​), తలచి తలచి (7జీ బృందావన్​ కాలనీ) లాంటి పాటలు కేకేను అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఇక కేకే చివరిగా తెలుగు 2014లో నీ జతగా నేనుండాలి చిత్రంలో.. కనబడునా, అనే సాంగ్​ పాడారు. బాలీవుడ్​తో పాటు తెలుగు, తమిళ్​, కన్నడ, మరాఠీ, బెంగాళీ, అస్సామీ, గుజరాతీ, మలయాళంలోనూ 800 దాకా పాటలు పాడారు ‘కేకే’.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 10 =