డిజిపి, మంత్రి కొడాలి నానిలపై సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్ట్

AP Politics, Arrested by AP Police, Buddha Venkanna, Buddha Venkanna About Kodali Nani, Buddha Venkanna Latest news, Buddha Venkanna Press Meet, Buddha Venkanna Sensational Comments on DGP and Minister Kodali Nani, Gudivada, Gudivada latest news, Kodali, Kodali Nani, Kodali Nani Gudivada Issue, Kodali Nani Latest News, Kodali Nani Updates, Kodali Nani Vs Buddha Venkanna, Mango News, TDP EX-MLC Buddha Venkanna Sensational Comments on DGP and Minister Kodali Nani, TDP Leaders, TDP MLC Buddha Venkanna, TDP MLC Buddha Venkanna Serious On Gudivada Issue In Press Meet, TDP vs YCP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గుడివాడ క్యాసినో పై రేగిన రగడ మరింత దుమారం రేపింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మొదలైన డైలాగ్ వార్ అరెస్టుల పర్వానికి దారి తీసింది. ఈ క్రమంలో.. మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అగ్ని ఆజ్యం పోశాయి.

సోమవారం మీడియాతో మాట్లాడిన బుద్ధా వెంకన్న మంత్రి నానితో పాటు డీజీపీని తీవ్రంగా విమర్శించారు. ఓ సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు, బెదిరింపుల వరకు వెళ్లారు. దీంతో.. సీఎం, కొడాలి నాని, డీజీపీపై వ్యతిరేకంగా బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, వైసీపీ నేతల ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించారు. బుద్ధా చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలకు వివరణ ఇవ్వాలంటూ పోలీసులు విజయవాడలోని ఆయన నివాసానికి వెళ్లారు.

పోలీసులు విచారణ నిమిత్తం వెంకన్నను స్టేషన్ కు రావాలని కోరారు. 41 ఏ నోటీసులు ఇవ్వకుండా విచారణకు ఎలా వస్తామని బుద్దా వెంకన్న అనుచరులు, టీడీపీ నేతలు నిలదీశారు. దీంతో.. అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే, ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే పోలీసులు బుధ్దా వెంకన్నను అరెస్ట్ చేశారు. దీంతో.. బుద్దా వెంకన్నను అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. అరెస్టులు చేస్తారా అని టీడీపీ నాయకులు పోలీసుల తీరుపై మండిపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here