క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూత, సెప్టెంబర్ 11న జాతీయ సంతాప దినంగా ప్రకటించిన భారత్

India To Observe One Day State Mourning On September 11Th As A Mark Of Respect On Passing Away Of Queen Elizabeth II, India Will Observe State Mourning On 11 September, Respect On Passing Away Of Queen Elizabeth II, Queen Elizabeth Ii Dies Aged 96, Queen Elizabeth Ii Dies At 96, Queen Elizabeth II Passes Away At 96 , Mango News, Mango News Telugu, Queen Elizabeth II Death At 96, Queen Elizabeth II Death Live Updates, Queen Elizabeth II Latest News And Updates, England Queen Queen Elizabeth II, England Queen Dies Aged 96, England Citizens Weep Demise Of Her Queen , Queen Elizabeth II

యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు నార్తర్న్ ఐర్లాండ్ క్వీన్ ఎలిజబెత్-2 సెప్టెంబర్ 8, 2022న తుదిశ్వాస విడిచినట్టుగా బర్మింగ్‌హమ్‌ ప్యాలెస్‌ అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 11వ తేదీని (ఆదివారం) జాతీయ సంతాప దినంగా భారత్ పాటించనుంది. మరణించిన క్వీన్ ఎలిజబెత్-2 కు గౌరవ సూచకంగా, భారతదేశం అంతటా సెప్టెంబర్ 11వ తేదీన ఒక రోజు సంతాప దినం నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. సంతాప దినం రోజున అనగా సెప్టెంబర్ 11న భారతదేశం అంతటా జాతీయ జెండాను క్రమం తప్పకుండా ఎగురవేసే అన్ని భవనాలపై జాతీయ జెండాను సగం వరకు అవనతం చేయనున్నారు. అలాగే ఆ రోజున ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ముందుగా క్వీన్ ఎలిజబెత్-2 తన తండ్రి కింగ్ జార్జ్-6 మరణం తరువాత ఫిబ్రవరి 6, 1952న తన 25 ఏళ్ల వయసులో బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించింది. ఆమె 70 సంవత్సరాల 214 రోజుల పాటుగా క్వీన్ గా పాలించగా, ఏ బ్రిటీష్ చక్రవర్తి లేదా ఏ మహిళా దేశాధినేతలు కూడా ఇంత సుదీర్ఘకాలం పాలించలేదు. క్వీన్ ఎలిజబెత్-2 మరణం పట్ల పలువురు ప్రపంచ దేశాధినేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇక క్వీన్ మృతి నేపథ్యంలో ఆ దేశంలో 10 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. మరోవైపు క్వీన్ ఎలిజ‌బెత్-2 తర్వాత ప్రోటోకాల్‌ ప్రకారం ఆమె మొదటి కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ బ్రిటన్ కు రాజుగా సింహాసనం అధిష్టించనున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + nineteen =