జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు

President Droupadi Murmu PM Modi Sonia Gandhi Pay Tribute to Mahatma Gandhi at Rajghat on His Birth Anniversary, President Droupadi Murmu Tribute to Mahatma Gandhi, Sonia Gandhi Pay Tribute to Mahatma Gandhi, PM Modi Pay Tribute to Mahatma Gandhi, Mahatma Gandhi Jayanthi, Mango News, Mango News Telugu, Mahatma Gandhi, Mahatma Gandhi Birth Anniversary, Gandhi, Gandhi Birth Anniversary, President Droupadi Murmu, Sonia Gandhi, Prime Minister MOdi, Narendra Modi, Mahatma Gandhi News And Latest Photos, Rajghat

భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద గాంధీజీకి ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. ఈ ఉదయం నుంచి పలువురు ప్రముఖులు రాజ్‌ఘాట్ సందర్శించి మహాత్మునికి నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, పలు పార్టీల నాయకులు నివాళులర్పించారు. జాతిపితకు నివాళులు అర్పించిన అనంతరం అక్కడ జరిగిన ప్రార్ధనా కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు. రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, గాంధీ ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించాయని మరియు ఆయన ఆలోచనలు కోట్లాది మందికి బలాన్ని అందించాయని పేర్కొన్నారు.

అదేవిధంగా గాంధీజీ 153వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నేతలు పలు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకులు, మంత్రులు, సెలెబ్రిటీలు, క్రీడాకారులు సోషల్ మీడియా వేదికగా మహాత్మా గాంధీ ఆశయాలను స్మరించుకుంటున్నారు. మరోవైపు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 118వ జయంతిని పురస్కరించుకుని విజయ్‌ఘాట్‌ వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి తనయుడు అనిల్ శాస్త్రి, తదితరులు నివాళులు అర్పించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here