10 రోజుల వ్యవధిలో బ్యాంకులకు 7 రోజులు సెలవులు, వివరాలు ఇవే…

Bank Bandh, Bank holidays, Bank Holidays 2021: Banks To Remain Closed, Bank Holidays alert! Banks to remain closed, bank holidays in march and april 2021, Banks to remain closed 7 days from 27 March to 4 April, Banks to remain closed for 7 days, Banks to remain shut for 7 days, Mango News, Public Sector Banks will be Closed, Public Sector Banks will be Closed For 7 Days, Public Sector Banks will be Closed For 7 Days from March 27 to April 5th

ప్రభుత్వరంగ బ్యాంకులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. మార్చి 27వ తేది నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు మొత్తం 10 రోజుల్లో కేవలం మూడు రోజులు మాత్రమే బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెలవుల క్యాలెండర్ లో ప్రకటించిన సెలవులు మరియు ఆదివారం, నాలుగో శనివారం వంటి సెలవులు వరుసగా రానుండడంతో, ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి అందుకు అనుగుణంగా బ్యాంక్ లావాదేవీలు జరుపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా బ్యాంక్ సెలవులు రీజియన్ ఆఫీస్ వారీగా ఉంటాయి, దేశవ్యాప్తంగా ఒకే విధంగా పాటించబడవు. దీంతో వినియోగదారులు ముందుగానే చెక్ చేసుకుని ఇబ్బందులు లేకుండా బ్యాక్ లావాదేవీలను పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది.

వరుస బ్యాంక్ సెలవుల వివరాలు:

  1. మార్చి 27 – నాలుగో శనివారం
  2. మార్చి 28 – ఆదివారం
  3. మార్చి 29 – హోలీ పండుగ
  4. మార్చి 30 – బ్యాంకులు పనిచేస్తాయి
  5. మార్చి 31 – బ్యాంకులు పనిచేస్తాయి
  6. ఏప్రిల్ 1 – వార్షిక ఖాతాల మూసివేత (సెలవు)
  7. ఏప్రిల్ 2 – గుడ్ ఫ్రైడే
  8. ఏప్రిల్ 3 – బ్యాంకులు పనిచేస్తాయి
  9. ఏప్రిల్ 4 – ఆదివారం
  10. ఏప్రిల్ 5 – బాబు జగజ్జీవన్‌రామ్‌ జయంతి
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =