తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్ కు ఎంపికైన 60 మందికి నియామక పత్రాలు అందజేత

Appointment Orders to 60 Newly Selected Candidates in TSBCL, Mango News, Minister Srinivas Goud, Minister Srinivas Goud Handed over Appointment Orders to 60 Newly Selected Candidates in TSBCL, Newly Selected Candidates in TSBCL, Srinivas Goud, telangana, Telangana Beverages Corporation, TELANGANA PROHIBITION AND EXCISE DEPARTMENT, Telangana State Beverages Corporation, Telangana State Beverages Corporation Ltd, TSBCL

తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆబ్కారీ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో టీఎస్ పీఎస్సి ద్వారా తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్ కు ఎంపికైన 60 మంది అభ్యర్థులకు నియమకాల పత్రాలను అందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థలను ఆదాయ మార్గాలుగా చూశారు, అలాగే సంస్థ బాగోగులు, ఉద్యోగులకు మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ప్రభుత్వ కార్యాలయాలను, రవాణా సదుపాయాలను కల్పించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆబ్కారీ శాఖ అధికారులు అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసి అక్రమంగా మద్యం రాకుండా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించడం వల్ల సంస్థ కు భారీగా ఆదాయం పెరిగిందన్నారు. ఉద్యోగులు మరింత సమర్థవంతంగా, అంకిత భావంతో పని చేసి ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. గతంలో ఉన్న సిబ్బందికి అదనంగా మరో 60 మంది సిబ్బందిని నియమించిన చరిత్ర గతంలో ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. టీఎస్‌బీసీఎల్‌ సంస్థను మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం చరిత్రాత్మక రవీంద్రభారతిలో నిర్వహించి కొత్తగా ఎంపికైనా ఉద్యోగులలో స్ఫూర్తిని పెంచడం జరిగిందన్నారు. 62 మంది ఉద్యోగులతో టీఎస్‌బీసీఎల్ ప్రతి నెల సుమారు మూడు వేల కోట్ల రూపాయలతో, సుమారు ఏడాదికి 36 వేల కోట్ల రూపాయల టౌర్నోవర్ సాధించిన సంస్థ ప్రపంచంలో ఎక్కడ లేదన్నారు. టీఎస్‌బీసీఎల్ సంస్థ ద్వారా ప్రభుత్వానికి బాగా ఆదాయం వస్తుందన్నారు. సంస్థలోకి కొత్తగా వస్తున్న ఉద్యోగులను స్వాగతించారు. ఉద్యోగుల మరింత కష్టపడి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆబ్కారీ శాఖ అదనపు కమిషనర్ అజయ్ రావు, రెవెన్యూశాఖ జాయింట్ సెక్రటరీ రాంసింగ్, టీఎస్‌బీసీఎల్‌ ఓఎస్డీ సంతోష్ రెడ్డి, ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు హరికిషన్, జిఎం అబ్రహం తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =