నేడే పల్స్‌పోలియో కార్యక్రమం

Pulse Polio Immunisation Drive Starts from January 19th
జనవరి 19, ఆదివారం నాడు దేశవ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్ కు దోహదం చేసేలా 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అన్ని రాష్ట్రాల్లో వైద్యశాఖ అధికారులు పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. జనవరి 19న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో జనవరి 20, 21 తేదీలలో కూడా పోలియో చుక్కలు వేయించుకొని చిన్నారులను గుర్తించి చుక్కల మందు వేయనున్నారు. పోలియోమైలిటిస్‌ అనే వ్యాధిని నిర్ములించడానికి 1995వ సంవత్సరం నుంచి భారత ప్రభుత్వం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. తల్లిదండ్రులు మర్చిపోకుండా తమ చిన్నారులను పోలియో కేంద్రాల వద్దకు తీసుకెళ్లి చుక్కలు వేయించాల్సిందిగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =