ఐపీఎల్-2021 వేలం అప్‌డేట్స్

2021 IPL Auction, Chennai, IPL 2021, IPL 2021 Auction, IPL 2021 Auction Live Updates, ipl 2021 auction updates, IPL 2021 player auction, IPL 2021 Players Auction Live Streaming Online, IPL Auction, IPL Auction 2021, IPL Auction 2021 Live, IPL Auction 2021 Live Updates, IPL Auction Live Updates, Mango News

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)-2021 వేలం పక్రియ ఫిబ్రవరి 18, గురువారం నాడు మధ్యాహ్నం 3:00 గంటలకు చెన్నైలో ప్రారంభమైంది. 292 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. వీరిలో 164 మంది భారత్, 125 మంది విదేశీ, ముగ్గురు అసోసియేట్‌ దేశాల క్రికెటర్లు ఉన్నారు. కాగా ఈ వేలం ద్వారా ఎనిమిది ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 61 మంది క్రికెటర్లను మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. వీరిలో 22 మంది వరకు విదేశీ ఆటగాళ్ళు ఉండే అవకాశం ఉంది.

ఐపీఎల్-2021 వేలం అప్‌డేట్స్:

  • అర్జున్ టెండూల్కర్ – కనీస ధర రూ.20 లక్షలతో ముంబయి ఇండియన్స్‌ దక్కించుకుంది. ‌
  • హర్భజన్ సింగ్ – రూ.2 కోట్లు – కోల్‌కతా నైట్‌రైడర్స్‌
  • ముజీబ్ ఉర్ రెహమాన్ – రూ.1.5 కోట్లు – సన్ రైజర్స్ హైదరాబాద్
  • సామ్ బిల్లింగ్స్ – రూ.2 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
  • కేడర్ జాదవ్ – రూ.2 కోట్లు – సన్ రైజర్స్ హైదరాబాద్
  • కరుణ్ నాయర్ – రూ.50 లక్షలు – కోల్‌కతా నైట్‌రైడర్స్‌
  • ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ డానియెల్ క్రిష్టియన్ – రూ.4.80 కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు‌ దక్కించుకుంది.
  • ఫేబియన్ అలన్ (వెస్టిండీస్) – రూ.75 లక్షలకు పంజాబ్ కింగ్స్‌ దక్కించుకుంది.
  • న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ జేమ్స్ నిషం – రూ.50 లక్షలకు ముంబయి ఇండియన్స్‌ దక్కించుకుంది.
  • కైల్ జేమిసన్-బౌలర్- న్యూజిలాండ్ : కనీస ధర రూ.75 లక్షలు కాగా ‘రూ.15 కోట్లు’ కు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు దక్కించుకుంది. జేమిసన్ కోసం ఆర్సీబీతో పాటుగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడ్డాయి. పంజాబ్ కింగ్స్ రూ.14.75 కోట్ల వరకు వేలంలో ఉంది.
  • టామ్ కరన్ : కనీస ధర రూ.1.5 కోట్లు కాగా ‘రూ.5.25 కోట్లు’ కు ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది.
  • మొయిసెస్ హెన్రిక్స్: కనీస ధర కోటి కాగా ‘రూ.4.20 కోట్లు’ కు పంజాబ్ కింగ్స్‌ దక్కించుకుంది.
  • చటేశ్వర్ పుజారా: కనీస ధర రూ.50 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.
  • రిలే మెరెడిత్-బౌలర్-ఆస్ట్రేలియా: కనీస ధర రూ.40 లక్షలు కాగా ‘రూ.8 కోట్లు’ కు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. మెరెడిత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ.7.75 కోట్ల వరకు వేలంలో ఉంది.
  • కృష్ణప్ప గౌతమ్-బౌలింగ్ ఆల్ రౌండర్-ఇండియా: కనీస ధర రూ.20 లక్షలు కాగా ‘రూ.9.25 కోట్లు’ కు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. కృష్ణప్ప గౌతమ్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా గట్టిగా పోటీపడ్డాయి.
  • షారుఖ్ ఖాన్-బౌలింగ్ ఆల్ రౌండర్-ఇండియా: కనీస ధర రూ.20 లక్షలు కాగా ‘రూ.5.25 కోట్లు’ కు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
  • జాయ్ రిచర్డ్ సన్ : ఈ 24 ఏళ్ల ఆస్టేలియా బౌలర్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, పంజాబ్ కింగ్స్ పోటీపడగా రూ.14 కోట్లకు పంజాబ్ కింగ్ దక్కించుకుంది.
  • నాథన్ కౌల్టర్ నైల్ : కనీస ధర రూ.1.50 కోట్లు కాగా ‘రూ.5 కోట్లు’ కు ముంబయి ఇండియన్స్‌ దక్కించుకుంది.
  • పీయూష్ చావ్లా: కనీస ధర రూ.50 లక్షలు కాగా ‘రూ.2.40 కోట్లు’ కు ముంబయి ఇండియన్స్‌ దక్కించుకుంది.
  • షెల్డన్ కాట్రేల్, అదిల్ రషీద్, రాహుల్ శర్మ, ముజీబ్ ఉర్ రెహమాన్, హర్భజన్ సింగ్, ఐష్ సోధి, ఖ్వాయిస్ అహ్మద్ లపై ఏ జట్టు ఆసక్తి చూపలేదు.
  • ముస్తాఫిజుర్ రెహ్మాన్ : కనీస ధర కోటికి‌ దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్
  • ఉమేష్ యాదవ్: కనీస ధర రూ. కోటికి దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
  • ఆడమ్ మిల్నే (న్యూజిలాండ్): కనీస ధర రూ.50 లక్షలు కాగా ‘రూ.3.20 కోట్లు’ కు ముంబయి ఇండియన్స్‌ దక్కించుకుంది.
  • వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ : గ్లేన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్), అలెక్స్ కారే (ఆస్ట్రేలియా), కుశాల్ పెరెరా (శ్రీలంక)ను ఏ జట్టు ఎంచుకోలేదు.
  • ఇంగ్లాండ్ డేవిడ్ మలన్ ను కనీస ధర రూ.1.50 కోట్లకు దక్కించుకున్న పంజాబ్ కింగ్స్
  • క్రిస్ మోరిస్ (సౌతాఫ్రికా బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్): కనీస ధర రూ.75 లక్షలు కాగా రూ.16.25 కోట్లతో దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్. క్రిస్ మోరిస్ కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య తీవ్ర పోటీ. 16 కోట్ల వరకు వేలంలో ఉన్న పంజాబ్, చివరికి రూ.16.25 కోట్లతో దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్.
  • శివమ్ దూబే : కనీస ధర రూ.75 లక్షలు కాగా ‘రూ.4.40 కోట్లు’ కు రాజస్థాన్ రాయల్స్‌ దక్కించుకుంది.
  • మొయిన్ అలీ : కనీస ధర రూ.2 కోట్లు కాగా ‘రూ.7 కోట్లు’ కు చెన్నై సూపర్ కింగ్స్‌ దక్కించుకుంది.
  • షకిబుల్ హాసన్: కనీస ధర రూ.2 కోట్లు కాగా ‘రూ.3.20 కోట్లు’ కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దక్కించుకుంది.
  • గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ : కనీస ధర రూ.2 కోట్లు కాగా ‘రూ.14.25 కోట్లు’ కు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు‌ దక్కించుకుంది. ముందుగా మ్యాక్స్ వెల్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడగా, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తమ వేలాన్ని కొనసాగించాయి. తీవ్ర పోటీలో రూ.14.25 కోట్లుకు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు దక్కించుకుంది.
  • హనుమ విహారి: ఏ జట్టు ఆసక్తి చూపలేదు.
  • వెస్ట్ ఇండీస్ బ్యాట్స్ మెన్ లూయిస్, ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఆరోన్ పించ్ ను ఏ జట్టు తీసుకోలేదు.
  • స్టీవ్ స్మిత్: రూ.2.20 కోట్లుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది.
  • కరుణ్ నాయర్ ను ఏ జట్టు ఎంచుకోలేదు.
  • ఇంగ్లాండ్ ఆటగాళ్లు అలెక్స్ వేల్స్, జేసన్ రాయ్ ను ఏ జట్టు ఎంచుకోలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 1 =