రాజ్యసభలో వ్యవసాయ చట్టాలపై చర్చకు ప్రతిపక్షాల డిమాండ్, రేపటికి వాయిదా

Farm Laws, Farmers Protest Against Farm Laws, Farmers Protesting Against Farm Laws, Mango News, Opposition Parties Protest Over Farm Laws, Protest Over Farm Laws, Protest Over Farm Laws In Rajya Sabha, Rajya Sabha Adjourned, Rajya Sabha adjourned amid protest over farm laws, Rajya Sabha Adjourned for the Day, Rajya Sabha Today, Rajya Sabha Today Bill, Rajya Sabha Today Live, Rajya Sabha Today News

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఉదయం రాజ్యసభ రాజ్యసభ ప్రారంభమైంది. రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష పార్టీల సభ్యులు నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా నినాదాలు కొనసాగించారు. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ చేసిన ప్రసంగంలో రైతుల ఆందోళన గురించి ప్రస్తావించారు. కానీ ఈ అంశంపై చర్చ మొదటగా లోక్ సభలో ప్రారంభం కావాల్సి ఉంది. అందువలన రాజ్యసభలో బుధవారం నాడు చర్చిద్దామని సభ్యులకు సూచించారు. అయినప్పటికీ సభలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో సభను పలు మార్లు వాయిదా వేశారు. కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీల సభ్యులు వెనక్కి తగ్గకుండా వ్యవసాయ చట్టాలపై చర్చించాలని పట్టుపట్టడంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేస్తున్నట్టుగా చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + five =