ఐపీఎల్-2022: పంజాబ్ కింగ్స్ జట్టు కొత్త కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్

IPL 2022 Mayank Agarwal Named as New Punjab Kings Captain, Mayank Agarwal Named as New Punjab Kings Captain, Punjab Kings, New Punjab Kings Captain, Mayank Agarwal, Captain, Punjab Kings Captain, Indian Premier League-2022, Indian Premier League, 2022 Indian Premier League, 2022 IPL, IPL 2022, IPL will Kick off on March 26, IPL 2022 will Kick off on March 26, Cricket, Cricket Latest News, Cricket Latest Updates, Indian Premier League, Indian Premier League Latest News, Indian Premier League Latest Updates, IPL, Mango News, Mango News Telugu,

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022కు ముందు పంజాబ్ కింగ్స్ జట్టు కీలక ప్రకటన చేసింది. తమ జట్టు కొత్త కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్ ను నియమించినట్టు పంజాబ్ కింగ్స్ జట్టు సోమవారం ఒక ప్రకటన చేసింది. గత సీజన్ లో పంజాబ్ జట్టు కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ వ్యవహరించగా, తాజాగా ఆ బాధ్యతలను 31 ఏళ్ల మయాంక్ అగర్వాల్ స్వీకరించనున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందే పంజాబ్ జట్టు మయాంక్ అగర్వాల్ ను రెటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.

కెప్టెన్‌ గా ఎంపికైన తర్వాత మయాంక్ స్పందిస్తూ, “2018 నుండి పంజాబ్ కింగ్స్‌ జట్టులో ఉన్నాను. ఈ అద్భుతమైన జట్టుకు ప్రాతినిధ్యం వహించడం పట్ల చాలా గర్వపడుతున్నాను. జట్టుకు నాయకత్వం వహించే అవకాశం నాకు లభించినందుకు సంతోషిస్తున్నాను. ఈ బాధ్యతను అత్యంత చిత్తశుద్ధితో తీసుకుంటాను, కానీ అదే సమయంలో ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్న ప్రతిభతో నా పని సులభతరం అవుతుందని నమ్ముతున్నాను. జట్టుకు నాయకత్వం వహించే ఈ కొత్త పాత్రను నాకు అప్పగించినందుకు టీమ్ మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు. కొత్త సీజన్, దానితో పాటు అది తెచ్చే కొత్త సవాళ్ల కోసం ఎదురు చూస్తున్నాను” అని పేర్కొన్నారు. మయాంక్ అగర్వాల్ పంజాబ్ తరపున ఐపీఎల్-2021లో కీలకంగా రాణించాడు. 12 మ్యాచ్‌లలో 40.09 సగటుతో 441 పరుగులు చేశాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =