బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్: ఇకపై 24×7 అందుబాటులోకి ఆర్‌టీజీఎస్ సేవలు

RBI Announced That RTGS Money Transfer Facility To Be Operational on 24-hour Basis From Today,RBI,RTGS,RTGS Money Transfer,RTGS Money Transfer Facility,RTGS Money Transfer Facility To Be Operational 24-hour From Today,RTGS Money Transfer Facility To Be Operational on 24-hour Basis From Today,Mango News,Mango News Telugu,RTGS Payment Facility To Start On 24-hour Basis From Today,RTGS Payment Facility From Today,RTGS Money Transfer Facility To Be Operational 24-hour,RTGS Money Transfer Facility Now Available 24-hour,RTGS Money Transfer Facility Operational Timings

ఆన్‌లైన్‌ ద్వారా పెద్ద మొత్తంలో డబ్భు బదిలీలు చేసే బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందింది. డిసెంబర్ 14, సోమవారం నుంచి ఆర్‌టీజీఎస్(రియల్ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌) సేవలను 24 గంటల పాటు అందుబాటులోకి తీసుకువస్తునట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. “సోమవారం 12.30 am నుండి ఆర్‌టీజీఎస్ సౌకర్యం 24×7 అందుబాటులోకి రానుంది. దీన్ని సాధ్యం చేసిన ఆర్‌బిఐ, ఐఎఫ్ టిఏఎస్, ఇతర సర్వీస్ భాగస్వాముల బృందాలకు అభినందనలు” అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఆదివారం నాడు ట్వీట్ చేశారు.

పెద్దమొత్తంలో డబ్బు లావాదేవీల కోసం వినియోగదారులు ఆర్‌టీజీఎస్ ను ఉపయోగిస్తారు. ఆర్‌టీజీఎస్ ద్వారా బదిలీ చేసేందుకు కనీస మొత్తం రూ.2 లక్షలు కాగా, గరిష్ట లావాదేవీలకు ఎలాంటి పరిమితి లేదు. ఇప్పటి వరకు అన్ని బ్యాంకింగ్ పనిదినాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఆర్‌టీజీఎస్ సౌకర్యం అందుబాటులో ఉంది. 2 లక్షల లోపు లావాదేవీల కోసం ఉపయోగించే నెఫ్ట్(నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్ఫర్) విధానాన్ని ఏడాది క్రితమే ఆర్‌బిఐ 24 గంటల పాటుగా అందుబాటులోకి తేగా, తాజాగా ఆర్‌టీజీఎస్ విధానాన్ని కూడా ఏడాది పొడుగునా 24 గంటల పాటుగా అందుబాటులోకి తెస్తూ నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 12 =