ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న రోహిత్ శర్మ, ఫిట్‌నెస్‌ పరీక్షలో పాస్

Rohit Sharma Passed Fitness Test, Likely To Go Australia on December 13,Rohit Sharma Passes Fitness Test At NCA,Rohit Sharma Set To Fly To Australia On December 13,Rohit Sharma Passed Fitness Test To Go Australia on December 13,Mango News,Mango News Telugu,Rohit Sharma Passes Fitness Test,Rohit Sharma Likely To Go Australia on Dec 13,IND vs AUS 2020,India vs Australia 2020,Rohit Sharma Clears Fitness Test,Rohit Sharma All Set For Australia Tour,Rohit Sharma Set To Fly Australia For Last Two Tests,India vs Australia,India vs Australia Cricket,India vs Australia Test Match,Rohit Sharma News,Rohit Sharma,Cricketer Rohit Sharma

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా తొలిటెస్ట్ డిసెంబర్ 17 న అడిలైడ్ లో ప్రారంభం కానుంది. అయితే తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న భారత స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి టెస్ట్ సిరీస్ లో ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్తాడా లేదా అనే అంశంపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు బెంగళూరు జాతీయ క్రికెట్‌ అకాడమీలో నిర్వహించిన ఫిట్‌నెస్‌ పరీక్షలో రోహిత్ శర్మ పాసయ్యాడు. బీసీసీఐ వైద్య బృందం సహా ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రావిడ్, సెలక్టర్ల పర్యవేక్షణలో రోహిత్‌ శర్మకు ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహించినట్టు తెలుస్తుంది.

ఫిట్‌నెస్‌ పరీక్షలో పాస్ అవ్వడంతో డిసెంబర్‌ 14 కల్లా రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు చేరుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం బయో-సేఫ్టీ బబుల్ లో ఉన్న భారతజట్టుతో కలిసేందుకు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రోహిత్ శర్మ 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్ లో ఉండనున్నట్టు సమాచారం. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు టెస్టులకు రోహిత్‌ అందుబాటులో ఉండడు. చివరి రెండు టెస్టులకు రోహిత్ జట్టుతో చేరనున్నాడు. మరోవైపు భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి పాటర్నిటీ సెలవులో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్ట్ అనంతరం ఇండియాకు తిరిగి రానున్న సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 4 =