మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు కరోనా పాజిటివ్

Meghalaya CM Conrad Sangma Tested Positive For COVID-19,Meghalaya Chief Minister Conrad Sangma Tests Positive For COVID-19,Meghalaya CM Conrad K Sangma Tests COVID Positive,Conrad Tests positive For COVID-19,Meghalaya CM Conrad Sangma Tests Positive,Meghalaya CM Conrad Sangma Tests Covid-19 Positive,Meghalaya CM Conrad Sangma Tested Positive For Coronavirus Positive,CM Conrad Sangma,Meghalaya CM Conrad Sangma,Meghalaya CM Conrad Sangma Latest News,Meghalaya CM Conrad Sangma COVID News,CM Conrad Sangma Tests Coronavirus Positive,Mango News,Mango News Telugu,Conrad Sangma Tests Positive For COVID-19

దేశంలో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “కరోనా పరీక్షల్లో నాకు పాజిటివ్ గా తేలింది. నేను ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్ లో ఉన్నాను మరియు తేలికపాటి లక్షణాలను ఎదుర్కొంటున్నాను. గత 5 రోజులలో నాతో సంప్రదించిన వారందరినీ వారి ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోమని అభ్యర్థిస్తున్నాను. సురక్షితంగా ఉండండి” అని సీఎం కాన్రాడ్ సంగ్మా పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కర్ణాటక సీఎం యడియూరప్ప, హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్ కరోనా వైరస్ బారినపడి, చికిత్స అనంతరం కోలుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + six =