తీర్పుల్లో మహిళలపై ఈ పదాలు వాడొద్దు.. జడ్డీలకు సుప్రీం హెచ్చరిక

Supreme Court Unveils Handbook To Combat Gender Stereotypes in Judgments,Supreme Court Unveils Handbook,Handbook To Combat Gender Stereotypes,Combat Gender Stereotypes in Judgments,Mango News,Mango News Telugu,Supreme warning to judges,against women in judgments, judgments,Foul language experiments on women,Supreme Court Latest News,Supreme Court Latest Updates,Supreme Court Live News,Gender Stereotypes in Judgments News Today,Gender Stereotypes in Judgments Latest News

న్యాయస్థానాల్లో కొన్ని కేసుల్లో న్యాయమూర్తులు ఇస్తున్న ఆదేశాలు, తీర్పుల్లో మహిళలపై అనుచిత పద ప్రయోగాలు దొర్లుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని నియంత్రించేందుకు న్యాయమూర్తులకు ప్రత్యేక హ్యాండ్ బుక్ విడుదల చేసింది. ఇందులో జడ్డీలు తమ తీర్పుల్లో, ఆదేశాల్లో మహిళలను ఉద్దేశించి ఏయే పద ప్రయోగాలు చేయకూడదో సూచించింది. వీటిని న్యాయమూర్తులు తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశించారు.

చట్టపరమైన ప్రక్రియల్లో లింగపరమైన సున్నితత్వాన్ని పరిరక్షించే దిశగా సుప్రీంకోర్టు కీలక అడుగు వేసింది. లింగపరంగా మూస పద్ధతులతో నిండిన పదాలు, పదబంధాలను త్యజించేలా ఓ హ్యాండ్‌బుక్‌ను సుప్రీంకోర్టు విడుదల చేసింది. వాటిని కోర్టు ఆదేశాలలో ఉపయోగించకుండా న్యాయమూర్తులను హెచ్చరించింది. హ్యాండ్‌బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్ పేరుతో విడుదల చేసిన ఈ హ్యాండ్ బుక్ ఆవిష్కరణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ గత కోర్టు తీర్పులలో మహిళలకు ఉపయోగించిన అనేక అభ్యంతరకరమైన పదాలను ఉదహరించారు.

ఈ పదాల వాడకం సరికాదని, కోర్టు తీర్పులలో మహిళలపై వీటిని వాడినట్లు సీజేఐ తెలిపారు. ఈ హ్యాండ్‌బుక్ యొక్క ఉద్దేశం ఆ తీర్పులను విమర్శించడం లేదా వాటిని అనుమానించడం కాదని, ఇది లింగ పరమైన మూస పద్ధతులు అనుకోకుండా ఎలా కొనసాగుతున్నాయో తెలియజెప్పడమే అన్నారు. ఈ మూస పద్ధతులను నిర్వచించి వారిలో అవగాహన కల్పించడమే హ్యాండ్‌బుక్ లక్ష్యం అని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ఈ హ్యాండ్‌బుక్‌ను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామన్నారు.

స్త్రీ ఇతరులతో సంబంధంలో ఉన్నప్పుడు ఆమెను ‘ఉంపుడుగత్తె’గా సూచించే తీర్పుల్ని తాను చూసినట్లు సీజే చంద్రచూడ్ తెలిపారు. గృహ హింస చట్టం, ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయడానికి దరఖాస్తులు ఉన్న తీర్పులలో స్త్రీలను ‘కీప్‌లు’ అని పిలుస్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ హయాంలో లింగ మూస పద్ధతులను నిర్మూలించే హ్యాండ్‌బుక్ తీసుకురావడం సుప్రీంకోర్టు తీసుకున్న మరో కీలక నిర్ణయం. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పులు ప్రాంతీయ భాషల్లో అనువదించే నిర్ణయం తీసుకున్నారు. దీన్ని స్వాతంత్ర వేడుకల్లో ప్రధాని కూడా ప్రశంసించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 4 =