టీ20 ప్రపంచ కప్-2022: నెదర్లాండ్స్‌పై 56 పరుగుల తేడాతో భారత్ జట్టు ఘనవిజయం

T20 World Cup 2022 India Won by 56 Runs Against Netherlands, T20 World Cup 2022, India Won by 56 Runs Against Netherlands,India Vs Netherlands, India Won Over Netherlands, Mango News,Mango News Telugu, Virat Kohli 61 Not Out, Surya Kumar Yadav 51 Not Out, Rohit Sharma 53, Players With 3 Half Centuries, Indian Knock on Netherlands Team, Indian Cricket Team, Netherlands Cricket TEam, India Netherlands Match, IND Vs NL Match Latest News And Updates

టీ20 ప్రపంచ కప్-2022 లో భారత్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. అక్టోబర్ 27, గురువారం మధ్యాహ్నం సూపర్-12లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ స్టేడియంలో నెదర్లాండ్స్‌పై జరిగిన మ్యాచ్ లో 56 పరుగుల తేడాతో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో సూపర్-12 గ్రూప్-బి లో ఇప్పటికి 4 పాయింట్స్ తో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ పై మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అర్థ సెంచరీలతో రాణించారు.

ముందుగా టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 179 పరుగుల చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (9) పరుగులకే వెనుదిరగగా, రోహిత్ శర్మ (39 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సులు), విరాట్‌ కోహ్లీ (44 బంతుల్లో 62 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సులు) తో రాణించారు, వీరిద్దరూ 57 బంతుల్లో 73 పరుగులు జోడించారు. అలాగే విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్సు) 48 బంతుల్లో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి 95 పరుగులు జోడించడంతో భారత్ 179 పరుగులు సాధించింది. రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్ తమవైన షాట్లతో క్రీడాభిమానులను అలరించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఫ్రెడ్ క్లాసేన్ (1/33), వాన్ మెకెరెన్ (1/32) చెరో వికెట్ తీశారు.

అనంతరం 180 పరుగుల లక్ష్యఛేదనకై బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ బౌలర్ల ధాటికి నెదర్లాండ్స్ బ్యాటర్స్ చేతులెత్తేశారు. మూడో ఓవర్లోనే ఓపెనర్ విక్రమ్ జిత్ ను భువనేశ్వర్ కుమార్ బౌల్డ్ చేయడంతో నెదర్లాండ్స్ వికెట్ల పతనం ప్రారంభమైంది. 13 ఓవర్లో అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టాడు. నెదర్లాండ్స్ బ్యాటర్స్ లో టీమ్ పింగిల్ (20), అక్రమాన్ (17), షరీజ్ అహ్మద్ (16), బాస్ డి లీడే (16), మాక్స్ ఓడోడ్ (16) పరుగులు చేయగలిగారు. ఇక భారత్ బౌలర్లలో అశ్విన్ (2/21), భువనేశ్వర్ కుమార్ (2/9), అర్ష్‌దీప్ సింగ్ (2/37), అక్షర్ పటేల్ (2/18) వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేయడంతో భారత్ ఖాతాలో మరో విజయం చేరింది. ఈ మ్యాచ్ లో కీలక ప్రదర్శనకు గానూ సూర్యకుమార్ యాదవ్ కు ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇక టీ20 ప్రపంచ కప్ భాగంగా అక్టోబర్ 30న సాయంత్రం 4:30 గంటల నుంచి భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =