టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. కేసుని సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టులో పిటీషన్ వేసిన బీజేపీ

Telangana BJP Files Petition in High Court For Transfer of TRS MLAs Purchase Case To CBI, Telangana BJP Files Petition, BJP Files Petition in High Court, BJP HC Petition on TRS MLAs Purchase Case, BJP Demands MLAs Purchase Case To CBI , Mango News, Mango News Telugu, Allegations on TRS MLAs Purchasing Issue,Telangana BJP Chief Bandi Sanjay,Allegations on TRS MLAs Purchasing, TRS MLAs Purchasing Issue, TRS MLAs Purchasing Issue Amid Munugode By-poll, TRS MLAs Purchasing Issue, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna BJP Party,

తెలంగాణలో వెలుగుచూసిన అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 100 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారంటూ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీకి చెందిన సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి (ఏ1), హైదరాబాద్ కు చెందిన నందకిశోర్ (ఏ2), తిరుపతికి చెందిన సింహయాజి (ఏ3) అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే దీని వెనుక బీజేపీ ఉందనే వార్తలు రావడంతో ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తదితరులు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర పోలీసుల వ్యవహారశైలిఫై అభ్యంతరం తెలిపిన బీజేపీ, ఈ ఘటనపై ప్రత్యేక బృందంతో లోతుగా విచారణ చేయించాలని కోరింది. రాష్ట్ర పోలీసులు అధికార టీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరించే అవకాశం ఉందని, అదే జాతీయ దర్యాప్తు సంస్థ అయితే నిస్పక్షపాతంగా విచారణ జరుగుతుందని భావిస్తున్నామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఈ వ్యవహారంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయాలని, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని పిటిషన్ లో పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ శాఖ తరపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. కాగా బీజేపీ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే దీనిపై విచారణ తేదీని ప్రకటించాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =