కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal, Arvind Kejriwal Took COVID-19 Vaccine, Arvind Kejriwal Took First Dose of COVID-19 Vaccine, Corona Vaccination Drive, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, Covid Vaccination, Covid vaccination in India, Delhi CM, Delhi CM Arvind Kejriwal, Delhi CM Arvind Kejriwal Took COVID-19 Vaccine, Delhi CM Arvind Kejriwal Took First Dose of COVID-19 Vaccine, Delhi CM Arvind Kejriwal Took First Dose of COVID-19 Vaccine at LNJP Hospital, LNJP Hospital

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ తో పాటుగా మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి కూడా వ్యాక్సిన్‌ వేస్తున్నారు. మార్చి 1 న ప్రారంభమైన రెండోదశలో భాగంగా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా వాక్సిన్ మొదటి డోసును తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం నాడు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో ఆయన మొదటి డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటుగా ఆయన తల్లిదండ్రులు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. అర్హులైన వారంతా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఢిల్లీలో అవసరమైతే కరోనా వ్యాక్సిన్ సెంటర్లను మరింతగా పెంచుతామని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 3 =