పేదరికాన్ని రూపుమాపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు తెచ్చారు: మంత్రి కొప్పుల ఈశ్వర్

Minister Koppula Eshwar Participates in Meeting of Executive Directors of SC Corporation on Dalit Bandhu, Telangana Minister Koppula Eshwar Participates in Meeting of Executive Directors of SC Corporation on Dalit Bandhu, Koppula Eshwar Participates in Meeting of Executive Directors of SC Corporation on Dalit Bandhu, Meeting of Executive Directors of SC Corporation on Dalit Bandhu, Meeting of Executive Directors of SC Corporation, SC Corporation Executive Directors Meeting, SC Corporation Executive Directors, Executive Directors, SC Corporation, Telangana BC Welfare Minister Koppula Eshwar, BC Welfare Minister Koppula Eshwar, Telangana Minister Koppula Eshwar, Minister Koppula Eshwar, Telanagan SC Corporation Executive Directors Meeting News, Telanagan SC Corporation Executive Directors Meeting Latest News, Telanagan SC Corporation Executive Directors Meeting Latest Updates, Telanagan SC Corporation Executive Directors Meeting Live Updates, Mango News, Mango News Telugu,

ఎస్సీలలో నెలకొన్న పేదరికాన్ని పూర్తిగా రూపుమాపే సదాశయంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దళితబంధు పథకానికి రూపకల్పన చేశారని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా కూడా లేనటువంటి ఇటువంటి పథకాన్ని ఉద్యమ స్ఫూర్తితో ఒక యజ్ఞం మాదిరిగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎస్సీ కార్పోరేషన్ కు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెకర్స్ సమావేశం శుక్రవారం నాడు మాసబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,లబ్దిదారులకు అనుభవం, వృత్తి నైపుణ్యం ఉన్న, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడే యూనిట్ల ఎంపికకు ప్రాధాన్యతనివ్వాల్సిందిగా ఆదేశించారు. నిత్యావసరమైన పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు గాను డైరీలు, మినీ డైరీల ఏర్పాటును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా కోళ్లు, గొర్రెలు, చేపల పెంపకాన్ని ఇంకా ప్రోత్సహిద్దామన్నారు. ఇప్పటివరకు మంజూరైన మొత్తం 36 వేల 265 యూనిట్లు కాగా, వీటిలో 28వేల 970 యూనిట్లు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని, మిగతా వాటిని త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం 3 వేల 100 కోట్లు విడుదల చేసిందని, బడ్జెట్లో ప్రవేశపెట్టిన 17 వేల 700 కోట్లకు సంబంధించిన లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను త్వరలో మొదలు పెట్టాల్సి ఉంటుందని మంత్రి కొప్పుల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కార్పోరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్, దళితబంధు పథకం సలహాదారు లక్ష్మారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్, జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 7 =