వేగంగా దూసుకొస్తున్న సౌర తుపాన్

Threat to Earth a Fast Moving Solar Storm,Threat to Earth,A Fast Moving Solar Storm,Faster Moving Solar Eruption,Massive Plasma,Solar storm to hit Earth,NOAA, Spaceweather , Threat to Earth,Mango News,Mango News Telugu, A fast moving solar storm, Earth,solar storm,Solar Storm Latest News,Solar Storm Latest Updates,Threat to Earth News Today,Threat to Earth Latest News,Threat to Earth Latest Updates,Threat to Earth Live News
NOAA, Spaceweather , Threat to Earth, A fast-moving solar storm, Earth, solar storm

సౌర తుపాన్ లేదా సౌరగాలి గురించి మనం అప్పుడప్పుడూ వింటూ ఉంటాం. అయితే దీనిని సైంటిస్టులు భూ ఆయస్కాంత తుపాను అని కూడా పిలుస్తూ ఉంటారు. సూర్యుడిలోని భయంకరమైన డార్క్ హోల్‌లో ఏర్పడే అల్ప పీడనాలు, అధిక పీడనాల వల్ల ఇది సౌర తుపాన్ ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతారు. ఎన్ఓఏఏ అంటే నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ వాతావరణ నివేదిక.. 2003లో గ్రేట్ హలోవీన్ సౌర తుపాన్ సంభవించిందని తెలిపింది .

అయితే ఈ మధ్య సూర్యునిలో.. కరోనల్ హోల్ అని పిలువబడే ఒక పెద్ద రంధ్రాన్ని ..సూర్యుని భూమధ్యరేఖకు సమీపంలో మరోసారి సైంటిస్టులు గుర్తించారని ఎన్ఓఏఏ  తెలియజేసింది. ఆ కరోనల్ హోల్  వేగవంతమైన సౌర గాలిని భూమి వైపునకు ప్రవహింపజేస్తోందని చెప్పింది. అంతేకాకుండా రేడియేషన్ యొక్క శక్తివంతమైన ప్రవాహాలను కూడా కరోనల్ హోల్ విడుదల చేస్తోందని ఆధునిక స్పేస్ టెక్నాలజీ ద్వారా కనుగొన్నట్లు తెలిపింది.

2003లో ఏర్పడిన జియోమాగ్నెటిక్ తుపాన్  అప్పట్లో భూగోళంపై కమ్యూనికేషన్ అండ్ రేడియో సిగ్నల్స్‌ను ప్రభావితం చేశాయి. దీంతో మరోసారి అదే జరుగుతోందా అనే అనుమానాలను ఎన్ఓఏఏ  వ్యక్తం చేసింది.  రీసెంట్‌గా గుర్తించిన కరోనల్ హోల్ అని పిలువబడే సూర్యుడి జెయింట్ డార్క్ ప్యాచ్.. డిసెంబర్ 2 న సూర్యుని భూమధ్య రేఖకు  సమీపంలో కనిపించడమే ఈ అనుమానాలకు కారణం. దీంతో పాటు  24 గంటల్లో దాని గరిష్ట వెడల్పు దాదాపు 497,000 మైళ్లు  అంటే 800,000 కిలోమీటర్లకు  చేరుకుందని  ఎన్ఓఏఏ నివేదించింది.

అంతేకాకుండా డిసెంబర్ 4 నుంచి సూర్యుడిలోని పెద్ద శూన్యత నేరుగా భూమిపై ప్రభావం చూపిస్తున్నట్లు అనుమానాలున్నాయని ఎన్ఓఏఏ తెలియజేసింది. అయితే సూర్యుడి నుంచి ఆ రంధ్రం అదృశ్యమయితే మాత్రం భూమికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఖగోళ సైంటిస్టులు చెబున్నారు. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ దగ్గరున్న రికార్డుల ప్రకారం కరోనల్ హోల్ ఒక సౌర భ్రమణం 27 రోజుల కంటే ఎక్కువగా ఉంటుందని తేలింది. అయినా కూడా ఇప్పుడు ఈ రంధ్రం భూమికి దూరంగానే  కదులుతోంది కాబట్టి .. ప్రస్తుతానికి  భూగోళంపై ఎటువంటి ప్రభావం ఉండబోవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 2 =