తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్

ACB complaint against KCR on the day the Congress government fell,ACB complaint against KCR,KCR on the day the Congress government fell,Gaddam Prasad Kumar, Telangana assembly, telangana assembly speaker,Mango News,Mango News Telugu,ACB complaint against KCR Latest News,Telangana assembly Latest News,Telangana assembly Latest Updates,Telangana assembly Live News,Congress government Latest News,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates
Gaddam Prasad Kumar, Telangana assembly, telangana assembly speaker

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. పదేళ్ల తర్వాత తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క..  మంత్రులుగా 12 మంది నేతలు ప్రమాణం చేశారు. అయితే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. అత్యంత కీలకమైన స్పీకర్ పదవికి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్‌ను హైకమాండ్ ఎంపిక చేసింది. ఈ మేరకు అఖిల భాతర కాంగ్రెస్ కమిటీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున వికారాబాద్ నుంచి పోటీ చేసిన గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగురవేశారు.  2012 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రసాద్ కుమార్.. టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత తెలంగాణలో 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. రెండుసార్లు ప్రసాద్ కుమార్ ఓటమి పాలయినప్పటికీ.. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకే టికెట్ కట్టబెట్టింది.

ఈ మేరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ కుమార్ ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి మొతుకు ఆనంద్‌పై 12, 893 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. తాజా ఎన్నికల్లో గడ్డం ప్రసాద్‌కు 86,885 ఓట్లు పోలయ్యాయి.  దీంతో గడ్డం ప్రసాద్ కుమార్‌కు కాంగ్రెస్ హైకమాండ్ స్పీకర్ పదవిని కట్టబెట్టింది. అయితే ముందుగా దుద్దిళ్ల శ్రీధర్ బాబును స్పీకర్‌గా ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. అదే  సమయంలో గడ్డం ప్రసాద్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారని వార్తలొచ్చాయి. కానీ చివరి నిమిషంలో దుద్దిళ్ల శ్రీధర్ బాబును  కేబినెట్‌లోకి తీసుకోగా.. ప్రసాద్ కుమార్‌కు స్పీకర్ పదవిని కట్టబెట్టారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =