బ్రిటన్‌ ప్రధాని పీఠానికి చేరువలో భారత సంతతి నేత రిషి సునాక్‌.. సెప్టెంబర్ 5న లిజ్‌ ట్రస్‌తో తుది పోరు

UK PM Race Indian-Origin Rishi Sunak Ahead as Prime Minister Race to Face Liz Truss in Final Battle, Indian-Origin Rishi Sunak Ahead as Prime Minister Race to Face Liz Truss in Final Battle, Rishi Sunak Ahead as Prime Minister Race to Face Liz Truss in Final Battle, Indian-Origin Rishi Sunak to Face Liz Truss in Final Battle, Liz Truss in Final Battle, Final Battle, UK PM Race, UK Prime Minister Race, Prime Minister Race, Liz Truss, Indian-Origin Rishi Sunak, Rishi Sunak, Indian-Origin, UK Prime Minister Race News, UK Prime Minister Race Latest News, UK Prime Minister Race Latest Updates, UK Prime Minister Race Live Updates, Mango News, Mango News Telugu,

బ్రిటన్‌ ప్రధాని పీఠానికి భారత సంతతి నేత, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ ఒక్క అడుగు దూరంలో నిలిచారు. ప్రధాని పదవిని అధిష్టించే క్రమంలో ముందుగా అధికార కన్జర్వేటివ్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికకు జరుగుతున్న పార్టీపరమైన పోరులో కీలకమైన తుది దశకు ఆయన అర్హత సాధించారు. ఈ క్రమంలో బ్రిటీష్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టే ఇద్దరు ఫైనలిస్టులలో ఒకరిగా విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్‌తో ఆయన తలపడనున్నారు. బుధవారం జరిగిన టోరీ ఎంపీల ఐదవ మరియు చివరి ఓటింగ్ రౌండ్‌లో రిషి సునాక్‌ 137 ఓట్లతో విజయం సాధించారు. ఇక రెండవ స్థానంలో ఉన్న ట్రస్ 113 మంది ఎంపీల మద్దతును గెలుచుకున్నారు. వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్ 105 ఓట్లతో మూడో స్థానంలో నిలిచి రేసు నుంచి నిష్క్రమించారు.

కాగా ఇప్పటివరకు జరిగిన ప్రతి ఓటింగ్ రౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచిన సునాక్‌ సెప్టెంబర్ 5న జరుగనున్న తుది పోరులో లిజ్‌ ట్రస్‌తో పోటీ పడనున్నారు. దీనిలో భాగంగా వీరిద్దరూ కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల మద్దతు కోసం కొన్ని వారాల పాటు ప్రచారం చేపట్టనున్నారు. వచ్చే సోమవారం బీబీసీలో వీరిద్దరి మధ్య తొలి లైవ్‌ టెలివిజన్‌ డిబేట్‌ జరిగే అవకాశం ఉన్నది. ఇక పార్టీ సభ్యులు వీరిద్దరిలో ఒకరిని తమ నాయకుడిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. దాదాపు 2 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ సభ్యులు పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఓటేయనున్నారు. ఇద్దరిలో మెజారిటీ ఓట్లు వచ్చిన అభ్యర్థిని సెప్టెంబర్‌ 5న పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు. కాగా బ్రిటన్ రాజ్యాంగం ప్రకారం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వారే ప్రధాని చేపట్టడానికి అర్హులు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here