పార్లమెంటులో కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు సమావేశం, సంయుక్త ప్రకటన విడుదల

Floor leaders of Opposition Parties Issued Joint Statement Condemning Centre's Misuse of Investigative Agencies, Joint Statement Condemning Centre's Misuse of Investigative Agencies, Centre's Misuse of Investigative Agencies, Floor leaders of Opposition Parties, Opposition Parties Floor leaders, Floor leaders, Opposition Parties, Lashing out at the Centre government over the misuse of probe agencies, misuse of probe agencies, probe agencies misuse, Centre unleashed political vendetta using Investigative Agencies, political vendetta against political opponents, Investigative Agencies misuse, probe agencies misuse News, probe agencies misuse Latest News, probe agencies misuse Latest Updates, probe agencies misuse Live Updates, Mango News, Mango News Telugu,

ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభలోని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్‌ లు గురువారం పార్లమెంటులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశంలో వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారనే అంశంపై విపక్ష నేతలు చర్చించి, సంయుక్తంగా ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఐ(ఎం), డీఎంకే, ఎన్సీపీ, ఐయూఎంఎల్‌, జేకేఎన్‌సీ, టీఆర్‌ఎస్‌, ఎండీఎంకే, శివసేన, వీసీకే, ఆర్జేడీతో సహా పలు విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు పాల్గొని సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశారు.

“మోదీ సర్కార్ తన రాజకీయ ప్రత్యర్థులు మరియు విమర్శకులపై దర్యాప్తు సంస్థలను ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడం ద్వారా ఎడతెగని ప్రచారాన్ని ప్రారంభించింది. అనేక రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని అపూర్వమైన రీతిలో వేధింపులకు గురిచేస్తున్నారు. మేము దీనిని ఖండిస్తున్నాము మరియు మన సమాజంలోని సామాజిక నిర్మాణాన్ని నాశనం చేస్తున్నమోదీ సర్కార్ యొక్క ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మా సామూహిక పోరాటాన్ని కొనసాగించాలని మరియు మరింత ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నాము” అని విపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన ప్రకటనలో పేర్కొన్నాయి.

మరోవైపు నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. రాహుల్ గాంధీ మరియు ప్రియాంకా గాంధీ వాద్రాతో క‌లిసి సోనియా గాంధీ ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. సోనియా గాంధీ ఈడీ దర్యాప్తు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీల నేతలు కూడా సమావేశమై సంయుక్త ప్రకటన విడుదల చేయడం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − fifteen =