ఫిబ్రవరి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిపేందుకు అనుమతి

100% Seating Capacity, 100% Seating Capacity Theatres, Cinema Theatres open, Coronavirus Lockdown Guidelines, India Lockdown Guidelines, Mango News, Theatres, Theatres Seating Capacity, Theatres Seating Capacity News, Union Govt, Union Govt Allows Theatres to open with 100% Seating Capacity

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్స్, మల్టీఫ్లెక్స్ లు ప్రస్తుతం 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా కరోనాపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో థియేటర్లలో సీటింగ్ సామర్థ్యం పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖను సంప్రదించి కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీచేస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి 100 శాతం సీటింగ్ సామర్ధ్యంతో (ఆక్యుపెన్సీ) థియేటర్ల నడపడానికి కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు థియేటర్లలో యాజమాన్యాలు ఖచ్చితంగా పాటించాల్సిన నూతన మార్గదర్శకాలను జారీచేసింది.

టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ ను ప్రోత్సహించాలని సూచించారు. ఇక టికెట్లు కౌంటర్ల వద్ద, వెయిటింగ్‌ రూమ్స్, ప్రాంగణాల్లో ప్రేక్షకులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. థియేటర్స్ లో ఉష్ణోగ్రత 24-30 డిగ్రీల సెల్సియస్‌ ఉండాలని చెప్పారు. అలాగే ఎంట్రన్స్ వద్ద థర్మల్‌ స్క్రీనింగ్, సిబ్బంది, ప్రేక్షకులు మాస్క్ ధరించడం, హ్యాండ్‌ వాష్‌, శానిటైజర్లు అందుబాటులో ఉంచడం సహా కరోనా నిబంధనలు అన్ని పాటించాలని పేర్కొన్నారు. ఇక రద్దీ తగ్గించేందుకు షో టైమింగ్స్‌ లో మార్పులు చేసుకోవాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =