దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 6960 కరోనా బాధితులు, రికవరీ రేటు 98.40 శాతం

India Records 7495 Covid-19 Cases, 434 Deaths in Last 24 Hours, Omicron Cases Tally Reaches to 236

దేశంలో కొత్తగా 7,495 కరోనా పాజిటివ్ కేసులు, 434 మరణాలు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 23, గురువారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 3,47,65,976 కు, మరణాల సంఖ్య 4,78,759 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 0.62 శాతంగా నమోదవగా, వరుసగా గత 80 రోజులుగా పాజీటివిటీ రేటు 2 శాతం కన్నా తక్కువగానే నమోదవుతుంది. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 6,960 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3,42,08,926 కు చేరుకుంది.

ఇక కరోనా రికవరీ రేటు 98.40 శాతం గానూ, మరణాల రేటు 1.38 శాతంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 78,291 (0.22) మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు దేశంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 236కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 16 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, అత్యధికంగా మహారాష్ట్రలో 65, ఢిల్లీలో 64, తెలంగాణలో 38, రాజస్థాన్ లో 21, కర్ణాటకలో 19, కేరళలో 15, గుజరాత్ లో 14 కేసులు నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =