అమెరికాలో రద్దవుతున్న పలు విమానాలు.. 5జీ సేవల వలన విమానాలకు ముప్పు?

US Airlines Warns on 5G Could Cause Catastrophic Disruption,US Airlines Warns on 5G , Catastrophic Disruption,US Airlines ,Aviation crisis in US, airlines warn 5G rollout ,Aviation crisis in US, airlines warn 5G rollout could cause disruption,Major US airlines warn 5G could ground some planes,US airlines warn C-Band 5G ,US airlines warn of catastrophic disruption,mango news, 5g airlines issue, 5g issues with airlines, 5g airlines news, 5g airlines cancelling flights

అగ్రరాజ్యం అమెరికాలో బుధవారం నుంచి 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో.. ఆ దేశానికి రాకపోకలు సాగించే 8 విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది. దీంతో వాటిలో టికెట్లు బుక్‌ చేసుకున్న వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ నుంచి యూఎస్‌ వెళ్లాల్సిన ప్రయాణికులు విమాన సర్వీసు రద్దు కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిరిండియాతో పాటు.. దుబాయ్‌ ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌, జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ తదితర విమానయాన సంస్థలు కూడా అమెరికాకు రాకపోకలను నిలిపివేయడంతో అన్నిచోట్లా ఇదే పరిస్థితి నెలకొంది.

5జీ అంటే ఏమిటి? దీంతో విమానాలకు వచ్చే ప్రమాదం ఏంటి?

5జీ అంటే.. ప్రస్తుతం మనం వాడుతున్న ఇంటర్నెట్ కు సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ. దీనివల్ల మరింత వేగంగా డేటాను డౌన్‌లోడ్, అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ పరికరాలకు ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు. ఈ టెక్నాలజీ ఎక్కువగా రేడియో సిగ్నల్స్‌పై ఆధారపడుతుంది. అమెరికాలో, 5జీ కోసం ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీలు ‘సీబ్యాండ్’ స్పెక్ట్రమ్‌లో భాగంగా ఉన్నాయి. 5జీలో వాడే రేడియో తరంగాలు.. విమానాల్లోని రేడియో ఆల్టీమీటర్లలో ఉపయోగించే తరంగాలకు దగ్గరగా ఉంటాయి. అల్టీ మీటర్ల ద్వారా భూమి నుంచి విమానం ఎత్తును కొలుస్తారు. భద్రత, నావిగేషన్ సిస్టమ్‌ల డేటా కోసం వీటిని వాడతారు. 5జీ స్పెక్ట్రమ్‌లో వాడే రేడియో తరంగాల వల్ల విమానాల్లోని ఈ పరికరాల పనితీరుకు ఆటంకం కలుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. విమానం ల్యాండింగ్ సమయంలో భద్రతా సమస్యలు తలెత్తొచ్చని భావిస్తున్నారు.

అమెరికాలో 5జీ ఇంటర్‌నెట్‌ సేవలకు కేటాయించిన బ్యాండ్‌ (3.7-3.98 గిగాహెర్ట్జ్‌).. విమానాల ల్యాండింగ్‌లో కీలకమైన రేడియో అల్టీమీటర్లు పనిచేసే బ్యాండ్‌ (4.2-4.4 గిగాహెర్ట్జ్‌) ఫ్రీక్వెన్సీలు చాలా దగ్గరగా ఉండడమే ప్రస్తుత సంక్షోభానికి కారణం. దీనివలన విమానంలోని రేడియో అల్టీమీటర్ల పనితీరు దెబ్బతిని ఇంజన్‌, బ్రేకింగ్‌ వ్యవస్థలు ల్యాండింగ్‌ మోడ్‌లోకి మారకుండా నిరోధిస్తాయని.. ఫలితంగా విమానాలు రన్‌వేపై దిగవని అమెరికా ‘ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ)’ జనవరి 14న హెచ్చరించింది. 5జీ తరంగాల జోక్యం కారణంగా బోయింగ్‌ 787 డ్రీమ్ లైనర్‌లోని అనేక వ్యవస్థల్లో పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఇటీవలే అమెరికా విమానయాన నియంత్రణ సంస్థ ‘ఎఫ్ఏఏ’ హెచ్చరించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =