అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భేటీ

Biden and Putin begin high-stakes diplomacy at Geneva summit, Biden and Putin meet in Geneva, Biden meets Putin in Geneva, Biden Putin shake hands to kick off Geneva summit, Biden-Putin Geneva meeting, Geneva Summit, Live updates, Mango News, Russian President Vladimir Putin, US President Joe Biden, US President Joe Biden Meets with Russian President Vladimir Putin, US President Joe Biden Meets with Russian President Vladimir Putin at Geneva Summit, US President Joe Biden Russian President Vladimir Putin

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ బుధవారం నాడు జెనీవా సదస్సులో కలుసుకున్నారు. జెనీవాలో తమ మొదటి శిఖరాగ్ర సమావేశం సందర్భంగా విల్లా లా గ్రాంజ్ వెలుపల ఇరువురు నాయకులు కరచాలనం చేసుకున్నారు. ముందుగా స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు గై పార్మెలిన్ వారిద్దరికీ స్వాగతం పలికారు. మరోవైపు ఇరుదేశాల సంబంధాలపై జో బైడెన్‌, వ్లాదిమిర్‌ పుతిన్‌ దాదాపు ఐదు గంటలపాటు చర్చించనున్నట్టు తెలుస్తుంది. జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక పుతిన్‌ తో తొలిసారిగా సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ అంశాలపై కూడా వీరూ చర్చించనున్నట్టు సమాచారం. అమెరికా, రష్యా దేశాల మధ్య చాలా అంశాలపై సమస్యలు ఉన్నట్టు వార్తలు వస్తున్న క్రమంలో ఇరు దేశాధినేతలు మధ్య భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here