భారత అండర్‌-19 జట్టుపై కరోనా పంజా.. కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్ సహా ఆరుగురికి పాజిటివ్

6 India U-19 Players Including Captain Yash Dhull & Vice-Captain SK Rasheed Test Positive For Covid-19, 6 Indian Under-19 Players Including with Captain and Vice Captain Tested Positive, 6 Indian Under-19 Players Including with Captain and Vice Captain Tested Positive For Covid-19, COVID-19, ICC U-19 World Cup, ICC U19 World Cup, ICC U19 World Cup 2022, India U-19 skipper Yash Dhull, India U-19 team hit by COVID-19 scare during WC, Indian captain and vice-captain test Covid positive, Mango News, Six India U-19 Players, Six India U-19 Players Tests Positive, Team India Struck With COVID, U19 CWC 2022, U19 Indian capt Dhull among 6 team players test Covid-19, U19 World Cup

అండర్‌-19 వరల్డ్‌ కప్ లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత యువ జట్టుపై కరోనా మహమ్మారి పంజా విసిరింది. లీగ్‌ దశలో భాగంగా బుధవారం గ్రూప్‌-బిలోని ఐర్లాండ్‌తో మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే, సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్‌ యష్‌ ధుల్‌, తెలుగు ఆటగాడు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌తో పాటు మొత్తం ఆరుగురు క్రికెటర్లకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రధాన ఆటగాళ్లు లేకుండానే మిగిలిన 11 మందితో నిశాంత్‌ సింధు సారథ్యంలో భారత్‌ బరిలోకి దిగింది. కోవిడ్ బారినపడిన క్రికెటర్లందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని టీమ్ మానేజ్మెంట్ తెలిపింది. కోవిడ్ బారిన పడిన ఆటగాళ్లందరూ త్వరలోనే కోలుకుంటారని బీసీసీఐ అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఉగాండాతో జరగనున్న మ్యాచ్‌లో కూడా ఇదే టీమ్‌తో ఆడనున్నట్టు ఆ అధికారి తెలిపారు.

అయితే, ముఖ్యమైన ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగిన భారత జట్టు ఐర్లాండ్ పై ఘన విజయం సాధించింది. నిశాంత్‌ సింధు సారథ్యంలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 307 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు హర్నూర్ సింగ్ (88), రఘువంశీ (79) అర్ధశతకాలతో చెలరేగారు. తొలి వికెట్ కు 164 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. మరోవైపు మిడిలార్డర్ కూడా రాణించడంతో భారత్ 300 పైచిలుకు స్కోరు సాధించింది. అనంతరం 308 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 133 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు సమష్టిగా సత్తాచూపడంతో 39 ఓవర్లకే ఐర్లాండ్ ఆలౌట్ అయింది. హర్నూర్ సింగ్ ప్లేయర్ అఫ్ ది అవార్డు గెలుచుకున్నాడు. ఇప్పటికే భారత జట్టు మొదటి మ్యాచ్ లో పటిష్ట దక్షిణాఫ్రికాను ఓడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =