బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించిన విరాట్ కోహ్లీ

BCCI, BCCI Live Updates, BCCI Offers To Virat Kohli, BCCI Updates, Board of Control for Cricket in India, cricket live updates, Cricket News, Cricket updates, Indian cricket team, Mango News, new Test Captain, new Test Captain KL Rahul Or Rohit Sharma, Test Cricket Live Updates, Test cricket news, Test cricket updates, Test series, virat kohli, Virat Kohli Rejects BCCI Offer, Virat Kohli Rejects BCCI Offer Of Leading 100th Test Captaincy, Virat Kohli Rejects BCCI Offer Of Leading 100th Test Captaincy After Resigning From Post, Virat Kohli Resigning From Captain Post

అనూహ్య పరిణామాల మధ్య టీమిండియా టెస్ట్‌ సారధ్య బాధ్యతల నుంచి విరాట్‌ కోహ్లీ వైదొలిగిన విషయం​ తెలిసిందే. అయితే, కోహ్లీ.. టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ముందు జరిగిన ఓ పరిణామం ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. బీసీసీఐకి చెందిన ఓ సీనియర్‌ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. విరాట్‌ కోహ్లీ సంచలన ప్రకటనకు కొద్ది గంటల ముందు బీసీసీఐ నుంచి కోహ్లీకి ఓ ఆఫర్‌ వచ్చిందట. తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే 100వ టెస్ట్‌ మ్యాచ్‌కు సారధిగా వ్యవహరించిన తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలిగే అంశాన్ని పరిశీలించాల్సిందిగా బీసీసీఐ ప్రతినిధి కోహ్లీని కోరాడట.

అయితే, బీసీసీఐ ఇచ్చిన ఈ ఆఫర్‌ను కోహ్లీ సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. తనకెటువంటి ఫేర్‌వెల్‌ టెస్ట్‌ అవసరం లేదని, నేను ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోనని కోహ్లీ చెప్పాడట. అలాగే, తనకు మొదటి మ్యాచైనా, వందో మ్యాచైనా ఒకటేనని సదరు అధికారికి బదులిచ్చాడట. కాగా, కోహ్లీ వచ్చే నెలలో ఫిబ్రవరి 25-30 మధ్య శ్రీలంక తో బెంగళూరులో జరుగబోయే తొలి టెస్ట్‌ ద్వారా వంద టెస్ట్‌ల మైలురాయిని చేరుకోనున్నాడు. కోహ్లీకి ఐపీఎల్‌ వల్ల ఈ నగరంతో ప్రత్యేకమైన అనుబంధం​ ఏర్పడింది. ఎన్నో సంవత్సరాలుగా ఆటను ఐపీల్ లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

అందుకే, అతని గౌరవార్ధం బెంగళూరు నగరంలో ఫేర్‌వెల్‌ టెస్ట్‌ ఏర్పాటు చేయాలని బీసీసీఐ యోచించినట్లు తెలుస్తోంది. అయితే, ఇదివరకు జరిగిన పరిణామాల దృష్ట్యా బీసీసీఐ ఇచ్చిన ఆఫర్‌ను కోహ్లీ తిరస్కరించాడని సమాచారం. కాగా, 68 టెస్ట్‌ల్లో టీమిండియాకు సారధిగా వ్యవహరించిన కోహ్లీ.. ఏకంగా 40 మ్యాచ్‌ల్లో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో అతను భారత్ తరఫున అత్యధిక విజయాలు అందుకున్న సారథిగా రికార్డుల్లోకెక్కాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =