భారత్‌లో పెట్టుబడులు పెట్టండి: ‘ఇండియా ఐడియాస్ సమ్మిట్’ లో పీఎం మోదీ కీలక ప్రసంగం

India Ideas Summit, India Ideas Summit 2020, India Ideas Summit Highlights, Narendra Modi at India Ideas Summit LIVE Updates, national news, PM Modi, pm narendra modi, prime minister modi, Prime Minister Narendra Modi, USIBC India Ideas Summit

ప్రధాని నరేంద్ర మోదీ జూలై 22, బుధవారం నాడు ‘ఇండియా ఐడియాస్ సమ్మిట్’ లో కీలక ప్రసంగం చేశారు. యూఎస్‌- ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యుఎస్.ఐ.బి.సి) 45వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వర్చువల్‌ సదస్సులో పీఎం మోదీ మాట్లాడారు. గత దశాబ్దాలుగా యుఎస్.ఐ.బి.సి. భారతీయ మరియు అమెరికా వ్యాపారాన్ని మరింత సన్నిహితం చేసిందని మోదీ అన్నారు. సులభతర వాణిజ్యం అనేది ఎంత ముఖ్యమో, సులభంగా జీవించడం అనేది కూడా అంత ముఖ్యమని మోదీ పేర్కొన్నారు. భారత్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయమని, అమెరికా సంస్థలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు

“భారతదేశం ఇప్పుడు అవకాశాలకు కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. టెక్నాలజీ రంగానికి సంబంధించి భారతదేశంలో ఇటీవల ఒక ఆసక్తికరమైన నివేదిక బహిర్గతమైంది. పట్టణాల్లో ఇంటర్నెట్ వినియోగదారుల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగదారులు ఎక్కువగా ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. భారతదేశంలో ఇప్పుడు సుమారు 50 కోట్ల మంది దాకా ఇంటర్నెట్ ను ఉపయోగించేవారు ఉన్నారు. మరో 50 కోట్ల మందికి పైగా ప్రజలు త్వరలో ఇంటర్ నెట్ తో అనుసంధానం కావడానికి సిద్ధంగా ఉన్నారు. 5-జి, బిగ్ డేటా విశ్లేషణలు, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్-చైన్ మరియు ఇంటర్నెట్ విషయాల వంటి సాంకేతిక పరిజ్ఞానాలలో అవకాశాలు చాలా ఉన్నాయని” పీఎం మోదీ తెలిపారు.

“భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో భారతదేశం ఇటీవల చారిత్రాత్మక సంస్కరణలు చేసింది. వ్యవసాయ పెట్టుబడులు, యంత్రాలు, వ్యవసాయ ఉత్పత్తుల నిర్వహణ, తినడానికి సిద్ధంగా ఉండే పదార్ధాలు, మత్స్య ఉత్పత్తులు, సేంద్రీయ ఉత్పత్తులు వంటి వ్యవసాయ రంగానికి చెందిన అనేక విభాగాల్లో పెట్టుబడి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశ పుడ్ ప్రాసెసింగ్ రంగం 2025 నాటికి హాఫ్ ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. భారత వ్యవసాయ రంగంలో పెట్టుబడి అవకాశాలను వినియోగించుకోడానికీ ఇదే సరైన సమయమని” చెప్పారు.

“ఆరోగ్య సంరక్షణ రంగం, విద్యుత్తు రంగం, పౌర విమానయాన రంగం, ఆర్ధిక మరియు బీమా రంగం, రక్షణ రంగం, అంతరిక్ష రంగాలు, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టాలని భారతదేశం మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. మరోవైపు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ప్రతి సంవత్సరం, మేము రికార్డు స్థాయికి చేరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం అంతకు ముందు సంవత్సరం కంటే చాలా ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి. భారతదేశంలో 2019-20 ఆర్ధిక సంవత్సరంలో 74 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తాయి. అంతకుముందు సంవత్సరం కంటే 20 శాతం పెరిగింది. అమెరికా నుండి హామీ ఇచ్చిన పెట్టుబడులు ఈ సంవత్సరం ఇప్పటికే 40 బిలియన్ డాలర్లను దాటిందని యుఎస్.ఐ.బి.సి. లోని ప్రతినిధులు తెలియజేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా మహమ్మారి సమయంలో 2020 ఏప్రిల్ నుండి జూలై మధ్య కాలంలో భారతదేశం 20 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. భారతదేశం ఇంకా చాలా అవకాశాలను అందిస్తుందని” పీఎం మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 5 =