ఉత్తరాఖండ్, గోవా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, కొనసాగుతున్న పోలింగ్

2022 Up Assembly Elections, Assembly Elections, Goa Assembly Elections, Goa Elections, Mango News, UP assembly election 2022, UP Assembly Elections, Up Assembly Polls, UP Elections, UP Elections 2022, UP Elections 2022 Latest Update, UP Polls, Uttarakhand, Uttarakhand Assembly Elections, Voting Underway for Uttar Pradesh, Voting Underway for Uttar Pradesh Uttarakhand Goa Assembly Elections

ఉత్తరాఖండ్, గోవా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సోమవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో నేడు ఒకే విడతలో ఎన్నికల పోలింగ్ పూర్తి కానుండగా, ఉత్తర్ ప్రదేశ్ రెండో విడతలో భాగంగా 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి ఈ రోజు మొత్తం 165 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. అన్ని చోట్ల పోలింగ్ ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్‌ బూత్‌ల వద్ద బారులు తీరారు. అలాగే పలు పార్టీల కీలక నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో‌ పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలకు థర్మల్‌ స్కానింగ్ చేస్తూ, హ్యాండ్‌ శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. అలాగే ఈవీఎంలను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తున్నారు.

–>ఉత్తరాఖండ్ లో 70 అసెంబ్లీ స్థానాల్లో, గోవాలో 40 అసెంబ్లీ స్థానాల్లో అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు ఒకే విడతలో పోలింగ్ పూర్తికానుంది. ఇక ఉత్తర్ ప్రదేశ్ ఇప్పటికే ఒక విడత పోలింగ్ పూర్తవగా నేడు రెండో విడత పోలింగ్ జరుగుతుంది.

–>ఉత్తరాఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వివరాలు:

  • అసెంబ్లీ స్థానాలు: 70
  • బరిలో నిలిచిన అభ్యర్థులు: 632
  • పోలింగ్ కేంద్రాలు : 11,647
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రజలు: దాదాపు 82 లక్షలు

–>గోవాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వివరాలు:

  • అసెంబ్లీ స్థానాలు: 40
  • బరిలో నిలిచిన అభ్యర్థులు: 301
  • పోలింగ్ కేంద్రాలు : 1,722
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రజలు: దాదాపు 11.6 లక్షలు

–>ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వివరాలు (రెండో విడత)::

  • అసెంబ్లీ స్థానాలు: 55
  • బరిలో నిలిచిన అభ్యర్థులు: 586
  • పోలింగ్ కేంద్రాలు : 23,404
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రజలు: 2.20 కోట్లు
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =