పుల్వామా ఘటనలో అసువులు బాసిన.. అమరవీరులకు ప్రధాని మోదీ ఘన నివాళి

2019 Pulwama Attack, CRPF Jawans Killed in Pulwama Attack, Mango News, Modi Pays Homage to CRPF Jawans Killed in Pulwama Attack, PM Modi, PM Modi Pays Homage to CRPF Jawans, PM Modi Pays Homage to CRPF Jawans Killed in Pulwama Attack, PM Modi Pays Homage to CRPF Jawans Killed in Pulwama Attack Says Their Supreme Sacrifice Motivate Every Indian, Pulwama, Pulwama Attack, Says Their Supreme Sacrifice Motivate Every Indian

మూడేళ్ళ క్రితం (2019) దక్షిణ కాశ్మీర్ జిల్లా పుల్వామాలో తమ కాన్వాయ్‌పై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బందికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (ఫిబ్రవరి 14) ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. పుల్వామా దాడిలో అమరులైన ప్రతి వీరునికీ నా నివాళి. దేశానికి మీరు అందించిన విశిష్ఠ సేవలను స్మరించుకుంటున్నాను. జవాన్ల ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిగా నిలుస్తాయి. మీ అత్యున్నత త్యాగం వృధా కాదు. అది మమ్మల్ని మరింత పటిష్టంగా ఉండేలా కృషి చేయడానికి ప్రేరేపిస్తుందని, ప్రధాని మోదీ పేర్కొన్నారు.

2019 ఫిబ్రవరి 14న భారత సైనికులను లక్ష్యంగా చేసుకుని కశ్మీర్‌లోని పుల్వామా వద్ద పాకిస్థాన్ కు చెందిన జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తున్న సమయంలో ఉగ్రవాదులు మాటువేసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. అయితే, దీనికి భారత్ అంతే స్థాయిలో స్పందించింది. భారత వైమానిక దళం ఫిబ్రవరి 26 అర్ధరాత్రి సమయంలో పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేసింది. భారత్ చేసిన ఈ ప్రతీకార దాడితో.. పాకిస్తాన్‌ వణికిపోయింది. ఉగ్రవాద మూకలకు శిక్షణ ఇస్తున్న శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. ఈ దాడులలో ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో మరణించారు. పుల్వామా దాడి ఘటన తర్వాత పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా విమర్శలపాలైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 12 =