ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న ముఖేష్ అంబానీ-ఇషా అంబానీ

Mukesh Ambani Isha Ambani Introduces Azorte Clothing Store with AI Features in Gurugram,Mukesh Ambani Introduces Azorte Clothing Store,Isha Ambani Introduces Azorte Clothing,Azorte Clothing Store with AI Features,Mango News,Mango News Telugu,AI Features in Gurugram,Mukesh Ambani,Isha Ambani,Mukesh Ambani-Isha Ambani, first retail store in Gurugram, fast fashion brands , H&M, Zara, Forever21, Ajorte of Reliance Trends,Isha Ambanis Affordable Clothing Brand,Mukesh Ambani Latest News,Mukesh Ambani Latest Updates

దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ కంపెనీల పగ్గాలు పిల్లలకు అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వ్యాపారాలు మెరుపు వేగంతో విస్తరిస్తూ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రధానంగా ఇషా అంబానీ ఫుల్ స్పీడ్‌లో బిజినెస్‌ని అభివృద్ధి చేస్తున్నారు. ముఖేష్ అంబానీ, ఇషా అంబానీ కొన్ని సంవత్సరాల క్రితం Azorte అనే సొంత ప్రీమియం దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించారు. తాజాగా గురుగ్రామ్‌లో తమ మెుదటి రిటైల్ స్టోర్ ప్రారంభించారు. ఇది H&M, Zara, Forever21 వంటి దుస్తులు, ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్‌లకు గట్టి పోటీని ఇస్తోంది. అయితే రిలయన్స్ ట్రెండ్స్‌కు చెందిన అజోర్టే పైన పేర్కొన్న బ్రాండ్లకు భిన్నంగా ఉంటుంది.

ప్రస్తుతం ముఖేష్-ఇషా అంబానీల నేతృత్వంలో ఉన్న అజోర్టే ఫాస్ట్ ఫ్యాషన్ స్టోర్ కాదు. కానీ భారతీయ బ్రాండ్‌లు, స్వదేశీ లేబుల్‌ల నుంచి ప్రీమియం, డిజైనర్ దుస్తులను అందిస్తోంది. ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ట్రెండ్స్ ముంబై, పూణేలలో అజోర్టే స్టోర్‌లను స్థాపించగా.. రిలయన్స్ దుస్తుల బ్రాండ్ మొదటి స్టోర్ ఈ ఏడాది గురుగ్రామ్‌లో సెక్టార్ 68లోని ఎరియా మాల్‌లో ప్రారంభించబడింది. రిలయన్స్ ట్రెండ్స్ బ్రాండ్ ప్రత్యేకమైన షాపింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. తమ కోట్ల విలువైన కంపెనీని ముందుకు నడిపించేందుకు ముఖేష్-ఇషాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను (AI) అజోర్టే గురుగ్రామ్ స్టోర్‌లో అందుబాటులోకి తెచ్చారు. సాంప్రదాయ షాపింగ్ విధానానికి భిన్నంగా కస్టమర్లకు ప్రత్యేకమైన అనుభవాన్ని ఇది సృష్టించింది. Azorte స్టోర్‌లో మొబైల్ చెక్‌అవుట్ ఎంపిక, స్మార్ట్ ట్రయల్ రూమ్‌లు, సెల్ఫ్-చెకౌట్ కియోస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. దీనికి తోడు స్టోర్‌లో ఫ్యాషన్ డిస్కవరీ స్టేషన్ వంటి అనేక టెక్-ఎనేబుల్ కూడా ఉంది. AI ఆధారంగా పనిచేసే ఇది మీ శరీర రకాన్ని బట్టి దుస్తులను కొనుగొనడంలో సహాయ పడుతుంది. Azorte ప్రారంభం రిలయన్స్ రిటైల్ ఆదాయాన్ని మరింత పెంచింది. ఇది ప్రస్తుతం రూ.2.60 లక్షల కోట్లుగా ఉంది. ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ అర్మానీ, బల్గారి, బర్బెర్రీ వంటి అనేక లగ్జరీ దుస్తుల బ్రాండ్‌లను భారతదేశానికి తీసుకురావడానికి కృషి చేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 8 =