గ్యాస్ క్యానిస్టర్లను దేని కోసం వాడతారు?

What are gas canisters,gas canisters,What are canisters,Parliament Issue, What are gas canisters, gas canisters, tear gas from , public gallery into the Lok Sabha,Mango News,Mango News Telugu,What are colour gas canisters,Lok Sabha security breach,Nitrous Oxide gas canisters,Gas canisters Latest News,gas canisters Latest Updates,Parliament Issue Updates,Lok Sabha Latest News and Updates
Parliament Issue, What are gas canisters, gas canisters, tear gas from , public gallery into the Lok Sabha,

శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలలో బుధవారం జరిగిన సంఘటనపై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. డిసెంబర్ 13న పార్లమెంట్ సమావేశాలు  జరుగుతుండగా.. లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతకులు ప్రవేశించారు. ఓ ఆగంతకుడు పబ్లిక్ గ్యాలరీలో నుంచి లోక్‌సభలోకి దూకి గందరగోళం సృష్టించడమే కాకుండా.. ఎంపీలు కూర్చునే టేబుళ్లపైకి ఎక్కి నినాదాలు చేశాడు. మరో ఆగంతకుడు పబ్లిక్ గ్యాలరీ నుంచి టియర్ గ్యాస్‌ను లోక్‌సభలోకి వదిలాడు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో.. వెంటనే స్పందించిన  ఎంపీలు, సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా చుట్టుముట్టి ఆగంతకులను పట్టుకున్నారు.

22 ఏళ్ల క్రితం 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ ఘటనలో పోలీసులు, సిబ్బందితో కలిసి మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే  సరిగ్గా 22  ఏళ్ల క్రితం ఇలాంటి ఘటన జరగడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అధికార పార్టీ ఎంపీల పాస్‌లను చూపించి పార్లమెంట్ విజిటర్ గ్యాలరీకి  వచ్చిన నిందితులు.. బూట్లలో గ్యాస్ క్యానిస్టర్లను దాచుకుని వెంట తెచ్చుకున్నారు.

పార్లమెంటులో టియర్‌ గ్యాస్‌ ప్రయోగంలో  సాగర్ శర్మ, మనోరంజన్‌, అమోల్ షిండే, నీలం దేవి కౌర్‌, లలిత్ ఝా, విక్కీ శర్మలుగా నిందితులను గుర్తించారు. అయితే  సాగర్ శర్మ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో అని.. మనో రంజన్ కర్ణాటకలోని మైసూర్‌ అని దర్యాప్తులో పోలీసులు తేల్చారు. అమోల్ షిండే స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ కాగా.. నీలం దేవి కౌర్ స్వస్థలం హర్యాణాలోని హిస్సార్‌ అని తేల్చారు. ఈ కుట్ర వెనుక మరో కీలక సూత్రదారి ఉన్నట్లు  అనుమానించిన పోలీసులు దానిపై దర్యాప్తు చేపట్టారు.

అయితే దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పార్లమెంట్ ఇష్యూలో వాడిన  గ్యాస్ క్యానిస్టర్లపై అదే రేంజ్‌లో చర్చ నడుస్తోంది. గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏంటి వాటిని  ఎక్కడ ఉపయోగిస్తారు వంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి గ్యాస్ క్యానిస్టర్లను స్మోక్ బాంబులు అని..పొగ డబ్బాలు అని కూడా పిలుస్తుంటారు. అయితే వీటిని బహిరంగంగా ఉపయోగించడానికి చట్టబద్ధత ఉంది. ముఖ్యంగా సినిమాలు, ఫోటోషూట్‌లలో పొగ తెరలను సృష్టించడానికి వాడతారు.

అంతేకాదు మిలిటరీ విభాగాల్లో కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా శత్రువుల కళ్లను పొగతో ఏమార్చడానికి ఈ  గ్యాస్ క్యానిస్టర్లను వాడుతారు. అంతేకాకుండా క్రీడారంగంలో కూడా వీటిని వాడతారు. మెయిన్‌గా ఫుట్‌బాల్‌లో ఫ్యాన్స్‌.. తమ క్లబ్‌ల కలర్స్  ప్రదర్శించడానికి పొగ డబ్బాలను ఉపయోగిస్తారు.

అదే విధంగా గ్రనైడ్లతో కూడిన క్యానిస్టర్లను సైనిక ఆపరేషన్లలో కూడా వాడతారు. దట్టమైన పొగ తెరలను సృష్టిస్తే దాని వల్ల దళాల కదలికలు అస్పష్టంగా మారిపోతాయి. దీంతో శత్రువుల కంట పడకుండా తమ కీలక ఆపరేషన్లను కొనసాగించడంలో ఈ గ్యాస్ క్యానిస్టర్లు దోహదం చేస్తాయి. అలాగే గగనతల దాడులు, భద్రతా దళాలు దిగడం, తరలింపు కేంద్రాలను టార్గెట్  చేసుకోవడానికి వీటిని ఉపయోగిస్తుంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + twenty =