ఆసుపత్రిలో కేసీఆర్.. రేవంత్ రెడ్డి స్పీడ్‌కు బ్రేకులు

KCR in the hospital Brakes for Revanth Reddys speed,KCR in the hospital ,Brakes Revanth Reddys speed,KCR, KCR in Hospital, CM Revanth reddy, Congress Government,Mango News,Mango News Telugu,Telangana Chief Minister Revanth Reddy,Revanth Reddys speed,Revanth Reddy Latest News,Revanth Reddy Latest Updates,Revanth Reddy Live News, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates
KCR, KCR in Hospital, CM Revanth reddy, Congress Government

కేసీఆర్‌ అంటేనే భగ్గుమంటారు రేవంత్ రెడ్డి. తూటాల్లాంటి మాటలతో కేసీఆర్‌కు తూట్లు పొడుస్తుంటారు. సమయం దొరికినప్పుడల్లా ఉతికారేస్తుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఏ మాత్రం తగ్గకుండా కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను ఓ ఆటాడుకుంటారని అంతా భావించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వరుస పెట్టి విరుచుకుపడుతారని అనుకున్నారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయిపోయింది. కేసీఆర్ కాలుజారి కింద పడిపోవడంతో రేవంత్ దూకుడుకు బ్రేకులు పడినట్లు అయింది.

ఇటీవల ఎర్రవెళ్లిలోని తన ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ కాలుజారి కిందపడిపోయారు. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించి వచ్చారు. వరుసగా అధికార, ప్రతిపక్ష నేతలు వెళ్లి కేసీఆర్‌ను కలుస్తున్నారు. మరో మూడు, నాలుగు నెలల వరకు కేసీఆర్ బయటికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అయితే కేసీఆర్ బాత్ రూమ్‌లో కాలుజారి పడడం.. ఆయనకు సానుకూల వాతావరణాన్ని తెచ్చి పెట్టిందని విశ్లేషకులు అంటున్నారు.

ఎందుకంటే ప్రస్తుతం కేసీఆర్ ఆసుపత్రిలో ఉండడంతో.. గత ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేయడం రేవంత్ రెడ్డికి సాధ్యం కాదు. నేరుగా కేసీఆర్‌కు గురిపెట్టి విరమర్శలు చేయలేరు. అలాగే ఎటువంటి విమర్శలు చేయకుండా ఉంటే కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్యూర్ కిందికే వస్తుంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లు ఉంది ప్రస్తుత పరిస్థితి. అందుకే రేవంత్ రెడ్డి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రోజుకు రెండు, మూడు శాఖల మీద రివ్యూలు చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేలా విమర్శలు చేయాలన్నా.. నిర్ణయాలు తీసుకోవాలన్నా అది కేసీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాతే సాధ్యమవుతుంది. అయితే ఇప్పటికే ఎన్నికలవేళ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ హామీల సంగతి ఏమయిందని నిలదీస్తున్నారు. ఇక కేసీఆర్ కోలుకొని బయటకు వచ్చే సరికి ఇంకా నాలుగైదు నెలల సమయం పడుతుంది. అప్పుడు ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలపై వేలెత్తి చూపే అవకాశం కేసీఆర్‌కు దొరుకుతుంది. ఇలా రాజకీయంగా చూసుకుంటే.. కాలు జారి కింద పడడం కేసీఆర్‌కు ప్లస్ అయినట్లు కనిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + seven =