కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ.. చంద్రబాబు టార్గెట్ ఇదే..

A majority of one lakh votes in the pile Chandrababus target is this,A majority of one lakh votes,Chandrababus target is this,one lakh votes in the pile,TDP, Chandrababu Naidu, Kuppam, AP Politics, Mango News,Mango News Telugu,AP Assembly elections,Chandrababu Naidu Latest News,Chandrababu Naidu Latest Updates,One Lakh Votes Latest News,One Lakh Votes Latest Updates,One Lakh Votes Live News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
TDP, Chandrababu Naidu, Kuppam, AP Politics, Ap Assembly elections

ఆంధ్రప్రదేశ్‌లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నాయకులు ఎవరూ లేరు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తొంభై వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. లక్ష ఓట్లకు దగ్గరగా వచ్చి ఆగిపోయారు. తెలంగాణలో మాత్రం ఆ రికార్డ్‌ను సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సాధించారు.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. అయితే ఈ లక్ష ఓట్ల మెజార్టీని టార్గెట్‌గా పెట్టుకున్నారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందాలని ప్రయత్నిస్తున్నారు.

లక్ష ఓట్ల మెజార్టీనే టార్గెట్‌గా చంద్రబాబు ముందుకు అడుగులేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేసిన చంద్రబాబు 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటి వరకు చంద్రబాబుకు వచ్చిన మెజార్టీ ఓట్లు అరవై వేల కంటే ఎక్కువ లేవు. కానీ ఈసారి ఎలాగైన లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందాలని చంద్రబాబు టార్గెట్ పెట్టుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. లక్ష ఓట్ల మెజార్టీనే లక్ష్యంగా కుప్పం కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. లక్ష ఓట్ల మెజార్టీతో తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు.

మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు వెళ్లిన చంద్రబాబు నాయుడు.. కుప్పం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారితో అనేక విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కుప్పంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అశాంతి, హింస, రాజకీయ వేధింపులు కొనసాగుతున్నాయని చంద్రబాబు అన్నారు. టీడీపీని ఇరకాటంలో పెట్టేందుకు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని మండిపడ్డారు. వైసీపీ సర్కార్ చిత్రహింసలకు గురిచేసినప్పటికీ బెదరకుడా నిలబడ్డ కార్యకర్తలను ఎప్పటికీ తాను గుర్తుపెట్టుకుంటానని చెప్పారు.

అలాగే తనను అక్రమ అరెస్ట్ చేసిన సమయంలో మద్ధతుగా నిలిచిన కార్యకర్తలకు, నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నటికైనా ధర్మమే జయించి తీరుతుందని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైసీపీ సర్కార్‌కు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఏపీలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఈసారి తనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకునేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 2 =