గూగుల్ మ్యాప్స్ కేవలం నావిగేషన్ కోసమే కాదు

Many things can be done with Google Maps,Many things can be done,Many things with Google Maps,Mango News,Mango News Telugu,Google Maps,Many things done with Google Maps, Google Maps is not just for navigation, navigation,Google Maps features that help,Surprising Things You Can Do with Google Maps,Things Google Maps Can Do For You,Google Maps Latest News,Google Maps Latest Updates,Google Maps Live News
Google Maps,Many things done with Google Maps, Google Maps is not just for navigation, navigation

ఒకప్పుడు ఏదైనా ఊరు వెళ్లాలన్నా, కొత్త ప్రాంతాలకు వెళ్లాలన్నా బాగా తెలిసిన వారి సహాయమో.. లేదా ఆ ఊరిలో ఎవరో ఒకరిని అడిగో ఆ ప్రాంతాలకు చేరుకునేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. టెక్నాలజీ డెవలప్ అయింది. దీంతో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు స్మార్ట్‌గా కావాల్సిన ప్లేసుకు వెళ్లిపోవచ్చన్న నమ్మకం పెరిగిపోయింది. గూగుల్ మ్యాప్స్ హెల్ప్ తీసుకుని కావాల్సిన ప్లేసులు ఈజీగా తిరిగి వచ్చేస్తున్నారు.

ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి, డెస్టినేషన్ ఎంటర్ చేస్తే  ఎవరు ఎక్కడికి వెళ్లాలంటే వాళ్లను అక్కడికి తీసుకెళ్తుంది. అయితే గూగుల్ మ్యాప్స్ అంటే కేవలం నావిగేషన్, వెతుకుతున్న చోటు ఎక్కడ ఉందో మ్యాపింగ్ చేయడం ఒక్కటే కాదు.. మరికొన్ని స్పెషల్ ఫీచర్లు కూడా అందిస్తుంది.  అవును నిజమే గూగుల్ మ్యాప్స్ హోటళ్లు బుక్ చేసుకోవడానికి.. లేదా విమానాల టికెట్లు బుక్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు.

దీని కోసం  స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్, ల్యాప్ టాప్‌లోని గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత  కొద్ది రోజుల్లో ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో ఆ ప్లేసును సెర్చ్ చేయాలి. సిటీ, ఎయిర్ పోర్టు ఏది కావాలంటే దానిని ..సెర్చ్ బార్ లో ఎంటర్ చేసిన వెతకాలి. అలా కావాల్సిన ప్లేసు  మ్యాప్స్ లో కనిపించాక.. స్క్రీన్ ని జూమ్ చేయాలి. ఆ వెంటనే సెర్చ్ నియర్ బై.. బటన్ ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత కేటగిరీల లిస్ట్ నుండి హోటల్స్ ను సెలక్ట్ చేసుకోవాలి.

అప్పుడు గూగుల్ మ్యాప్స్ మీకు ఆ ప్లేసులో దగ్గరలో గల హోటళ్ల లిస్టును  చూపిస్తుంది.అప్పుడు ఆ హోటల్  ప్రైస్, రేటింగ్ వంటి ఫిల్టర్లను ఉపయోగించి లిస్టును తనిఖీ చేయాలి. ఏదైనా హోటల్‌ను సెలక్ట్ చేసుకొని వ్యూ మోర్ డిటైల్స్ పై క్లిక్ చేయాలి.దీంతో ఫొటోలు, రివ్యూలు, బుకింగ్ ఆప్షన్లను తనిఖీ చేసుకోవచ్చు. తర్వాత నచ్చిన హోటల్ ని సెలక్ట్ చేసుకొని బుక్ నౌ లేదా వ్యూ వెబ్ సైట్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. తర్వాత అందులో ఉన్న వసతి, రేట్లు గురించి వివరాలు తెలుసుకోవచ్చు. ఒక వేళ అన్నీ నచ్చితే ఆ  హోటల్ ను గూగుల్ మ్యాప్స్ నుంచే డైరెక్ట్‌గా బుక్ చేసుకొనే అవకాశం కూడా ఉంటుంది. లేదా హోటల్ వెబ్ సైట్లోకి వెళ్లి రూం బుక్ చేసుకోవచ్చు.

ఒకవేళ మీరు గూగుల్ మ్యాప్స్ సాయంతో  ఫ్లైట్ బుక్ చేయాలనుకుంటే.. గూగుల్ మ్యాప్స్ సెర్చ్ లో ఎయిర్ పోర్ట్ అని టైప్ చేయాలి. మీ డెస్టినేషన్ కు దగ్గరలోని ఎయిర్ పోర్టులను సెలక్ట్  చేసుకోవాలి. ఆ తర్వాత దానిపై క్లిక్ చేసి, ఎక్స్ ప్లోర్ ఫ్లైట్స్ అనే ఆప్షన్ పై క్లిక్  చేసుకొని ఫ్లైట్ల కోసం వెతకాలి. అప్పుడు మీకు ఆ సమయంలో, ఆరోజు ఉన్న ఫ్లైట్ల లిస్ట్ కనిపిస్తుంది. మీరు డేట్, ఎయిర్ లైన్,ధర వంటి ఫిల్టర్లను ఉపయోగించి ఆప్షన్లను తనిఖీ చేసుకోవచ్చు. ఆ తర్వాత టైమ్,రోజును బట్టి ఒక ఫ్లైట్2ను  ఎంపిక చేసుకొని వ్యూ మోర్ డిటైల్స్ ను సెలక్ట్ చేయాలి. అయితే గూగుల్ మ్యాప్స్ ద్వారా బుక్ చేసుకోవడానికి అవదు. ఎయిర్ లైన్స్ అధికారిక వెబ్ సైట్ ద్వారా లేదా ఏదైనా బుకింగ్ ప్లాట్ ఫారం ద్వారా ఫ్లైట్ ను బుక్ చేయాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 3 =