AI వర్సెస్ మానవులు: టెక్నాలజీ ఎంతవరకు అవసరం?

AI vs Humans How necessary is technology

ప్రస్తుత డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు (AI) వేగంగా దూసుకుపోతోంది. అయితే, ఇది మానవ ఉనికికి ఎంతవరకు అవసరమనే చర్చ మొదలైంది. ప్రముఖ అడ్వకేట్ రమ్య ఒక వీడియోలో దీనిపై విశ్లేషించారు. AI వల్ల తక్కువ సమయంలో, 99% ఖచ్చితత్వంతో పనులు వేగంగా పూర్తవుతాయని, చాలా రంగాలలో ఇది మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. 

కానీ, దీనివల్ల అనేక ప్రతికూలతలు కూడా ఉన్నాయి. సాంకేతికతపై మితిమీరిన ఆధారపడటం వల్ల మానవ మేధస్సు క్షీణిస్తోందని, ఉద్యోగాల కోతతో పాటు తీవ్ర మానసిక ఒత్తిడి పెరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఏది నిజమో, ఏది అబద్ధమో (Deep Fake) గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది . సాంకేతికత మానవాళిని శాసించేలా కాకుండా, కేవలం అవసరమైన రంగాలకే పరిమితం చేస్తూ ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురావాలని ఆమె అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here