యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి విషయాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో ప్రపంచంలో సంతోషంగా ఉన్న దేశాల వివరాలను తెలియజేశారు. మొత్తం 156 దేశాల వివరాలతో ఐక్యరాజ్యసమితి 2018 ప్రపంచ సంతోష దేశాల నివేదికను విడుదల చేసిందని చెప్పారు. ఈ నివేదికలో ప్రపంచం మొత్తం మీద ఫిన్లాండ్ దేశ జనాభా అత్యంత సంతోషంగా ఉంటున్నట్టు తేలింది. ఫిన్లాండ్ దేశ ప్రజలు ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు?, మిగతా దేశాలైన అమెరికా, భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్ ఏయే స్థానాల్లో ఉన్నాయి వంటి పలు ఆసక్తికర విషయాలను ఈ ఎపిసోడ్లో విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]