జ్వరం వచ్చినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ట్రీట్మెంట్‌ తీసుకోవాల్సిందే..

If these symptoms appear during the fever treatment should be taken immediately,If these symptoms appear during the fever,treatment should be taken immediately,symptoms appear during the fever,Mango News,Mango News Telugu,High Temperature Causes and Treatments,dengue, fever, immediately treatment, Malaria, new type of fever, seasonal fevers, Symptoms, treatment,New type of fever Latest News,seasonal fevers Latest News
new type of fever, symptoms, fever, treatment, immediately treatment,Malaria, dengue, seasonal fevers

ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఫీవర్ ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. అయితే అన్ని జ్వరాలు ఒకటి కావని.. వైరస్‌లు కొత్త రూపంలో విజృంభిస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గుతో మొదలైన జ్వరం.. తగ్గకుండా  వేధిస్తోందంటే అది కచ్చితంగా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ అవుతుందని అంటున్నారు. వచ్చిన జ్వరాలను డెంగ్యూ, మలేరియా, ఫ్లూ అని టాబ్లెట్లు వాడేయకూడదు. ఎందుకంటే.. కొత్త వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు  విజృంభిస్తున్నాయి. కాబట్టి అశ్రద్ధ చేయకుండా డాక్టర్లను కలిసి సరైన ట్రీట్మెంట్  తీసుకోవాలి.

జ్వరంలో కనిపించే లక్షణాలతో పాటు.. సోకిన ఇన్‌ఫెక్షన్‌ను బట్టి మారుతూ ఉంటాయి. కొంతమందిలో జ్వరంతో పాటు దద్దుర్లు, ఇంకొందరిలో జ్వరంతో పాటు దగ్గు, జలుబు, గొంతునొప్పి, మరికొందరిలో జ్వరంతో పాటు విరోచనాలు, వాంతులు ఉంటాయి. అలాగే కొంతమందిలో తలనొప్పి, కామెర్లు కూడా కనిపిస్తాయి.

జ్వరం మరీ ఇబ్బంది పెట్టకపోతే.. శరీరంలో లిక్విడ్  పరిమాణం తగ్గకుండా చూసుకుంటూ రెస్ట్ తీసుకుంటే చాలు. అయితే రెండు రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గకపోతే  పరీక్షా ఫలితాలను బట్టి మలేరియా, డెంగ్యూ, ఇతర టెస్టులను చేయించాలి. జ్వరం తగ్గకపోగా దద్దుర్లు, రక్తస్రావం కనిపిస్తే, రక్తపరీక్షలో ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గినట్లు తేలితే యాంటీబయాటిక్స్‌ వాడాలి. తలనొప్పితో పాటు శరీరంలో ఒక వైపు పక్షవాతం లక్షణాలు కనిపిస్తే మాత్రం అది మెదడులో రక్తస్రావానికి సూచనగా భావించి అత్యవసర చికిత్సకు వెళ్లాలి.

విపరీతమైన జ్వరంతో పాటు మత్తు, వాంతులు, తీవ్రమైన తలనొప్పి, చూపులో తేడా ఉండడం వంటి లక్షణాలు మలేరియాలో ఉంటాయి. ఒకరోజు శరీర ఉష్ణోగ్రత చాలా తీవ్రంగా పెరగడం, ఆ తర్వాత రోజు తగ్గడం, పెరగడం వంటివి కనిపిస్తే దానిని మలేరియా జ్వరంగా భావించాలి. మలేరియాలో ఫాల్సిఫారం , వైవాక్స్‌ అనే రెండు రకాల జ్వరాలుంటాయి. అయితే  వీటిలో ఫాల్సిఫారం మలేరియా.. మెదడుకు కూడా పాకి ‘సెరెబ్రల్‌ మలేరియా’కు దారి తీస్తుంది.

అదే కొత్త రకం ఇన్ఫెక్షన్‌తో వచ్చిన జ్వరం అయితే.. మొదటి రోజు నుంచే జ్వరంతో పాటు గొంతు నొప్పి, దగ్గు కనిపిస్తాయి. రెండో రోజు నుంచి తెమడ కనిపించడం, జలుబు, ఒళ్లునొప్పులు లాంటి ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. ఈ జ్వరంలో కొంతమందిలో డెంగ్యూలో లాగే ప్లేట్‌లెట్లు కూడా పడిపోతూ ఉంటాయి. అలాగే కొంతమందిలో జ్వరంతో పాటు కామెర్లు, న్యుమోనియా కూడా రావొచ్చు. అందుకే మూడు రోజులకు కూడా జ్వరం తగ్గకపోతే.. అది ఏ జ్వరం అయినా కూడా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. అందులోనూ ఈ కొత్త రకం జ్వరంతో చాలా ఇబ్బందులు ఉంటున్నాయి కాబట్టి వెంటనే  ట్రీట్మెంట్ తీసుకోవాలి.

జ్వరం వచ్చాక ట్రీట్మెంట్ తీసుకునే కంటే.. సీజనల్ జ్వరాలు రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లారిపోయిన పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇంటి భోజనం తీసుకోవాలి.  ఎక్కువగా నీరు కలిగి ఉండే పళ్లు, కూరగాయలు తినాలి. అలాగే  ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకోవడంతో పాటు తేలికగా అరిగే సూప్స్‌, జావ, పళ్లరసాలు తీసుకోవాలి. అలాగే పీచు ఎక్కువగా ఉండే ఆహారం తినడంతో పాటు.. ఎక్కువ క్యాలరీలు, చక్కెరలు ఉన్న పదార్థాలు బాగా తగ్గించాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 15 =