అధికారిని చేపలకు ఎరగా వేసిన క్రూరమైన నియంత

A brutal dictator who killed an officer and baited him with fish,A brutal dictator who killed an officer,brutal dictator baited him with fish,killed an officer and baited him with fish,Mango News,Mango News Telugu,A brutal dictator, killed an officer, Kim, Kim Jong Un, North Korea, Piranha fish,A brutal dictator Latest News,Kim Jong Un News Today,North Korea Latest Updates,North Korea Live News
Kim Jong Un,A brutal dictator,killed an officer, North Korea, Kim,Piranha fish

పైశాచికత్వానికి పరాకాష్ట ఎవరు అన్నా.. ప్రపంచంలోనే నియంతగా పేరు బడ్డ వ్యక్తి పేరు చెప్పమన్నా.. అంతెందుకు అత్యంత కిరాతకుడు పేరు టక్కున చెప్పమన్నా.. ముందుగా అందరూ చెప్పే పేరు కిమ్ జోంగ్ ఉన్. నిజమే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉత్తర కొరియా దేశాన్ని అంతగా నియంతలా పాలిస్తున్నా కూడా.. ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పే దమ్ము అక్కడి వారిలో లేకుండా చేయడానికి ఎంతకైనా తెగిస్తుంటాడు. పైగా చాలామందికి కిమ్ ఒక నియంత అన్న విషయం కూడా తెలియకుండా జాగ్రత్త  పడటం కిమ్ ఎక్సట్రా క్వాలిఫికేషన్.

ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్‌ను దేవుడితో సమానంగా భావిస్తుంటారు అక్కడి వారు. అంతేకాదు కిమ్‌తో పాటు అతడి నాన్న, తాతలను  కూడా దేవుళ్లుగా కొలుస్తుంటారు. కిమ్ ఎవరినైనా శిక్షించినా అది దేవుడు విధించిన శిక్షగానే భావించేలా అక్కడివారిని మైండ్‌లో రిజిస్టర్ అయ్యేలా చేస్తారు కిమ్ దగ్గర ఉండే అధికారులు. కిమ్ విధించే శిక్షలు ఎంత భయంకరంగా ఉంటాయనేది ప్రపంచం మొత్తం కథలు కథలుగా చెప్పుకుంటారు. చిన్నచిన్నవాటికి కూడా పెద్ద శిక్షలు విధించడం కిమ్ ఇలాకాలో మాత్రమే చెల్లుతుంది. అంతెందుకు సౌత్ కొరియా సినిమాలు చూసినా, ఏదైనా ఇతర మతాన్ని పాటించినా, చివరకు ఎవరైనా పాటలు విన్నా కూడా అక్కడ చావు తప్పదు. ఆ మరణశిక్షలు కూడా చాలా అంటే చాలా  దారుణంగా ఉంటాయి.

కిమ్ నాయకత్వంపై కొంతమంది తిరుగుబాటు చేసిన వాళ్లనే కాదు.. కిమ్‌పై తిరుగుబాటు చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా వాళ్లను అత్యంత దారుణంగా చంపేస్తారు. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి ఉత్తర కొరియాలో జరగడంతో కిమ్ మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. తనపై తిరుగుబాటుకు పాల్పడుతున్నాడనే అనుమానంతో.. నార్త్ కొరియా సైన్యంలోని ఓ జనరల్ స్థాయి అధికారిని అత్యంత పైశాచికంగా ఇంకా చెప్పాలంటే దారుణాతి దారుణంగా హత్య చేయించాడు కిమ్.

ఆ అధికారిని చంపి.. మాంసాన్ని ఆహారంగా తీసుకునే అత్యంత ప్రమాదకరమైన పిరాన్హా చేపలకు కిమ్ అధికారులు ఆహారంగా వేసిన విషయాన్ని డైలీస్టార్ వెలుగులోకి తీసుకువచ్చింది. తిరుగుబాటుకు ఆ అధికారి కుట్ర చేశాడని చెబుతూ.. అతని కాళ్లు, చేతులు నరికేసి బతికి ఉండగానే.. పిరాన్హా చేపలు ఉన్న కొలనులో పడేసారు. ఆ చేపలు అతని శరీరాన్ని ముక్కలుముక్కలుగా కొరుక్కుని తిని చంపేశాయి. కిమ్ ర్యాంగ్‌సాగ్ రెసిడెన్స్ లో ఈ భారీ ఫిష్ ట్యాంక్ ఏర్పాటు చేసినట్లు డైలీస్టార్ తెలిపింది.

అంతేకాదు కిమ్ క్రూరత్వాన్ని చెప్పడం గురించి 1977లో వచ్చిన జేమ్స్ బాండ్ సినిమా ‘ ద స్పై హూ లవ్డ్ మీ’ మూవీని డైలీ స్టార్ మరోసారి గుర్తు చేసింది. ఈ సినమాలో విలన్ తన ప్రత్యర్థులను షార్క్ చేపలు ఉన్న ఆక్వేరియంలో పడేసి హత్య చేస్తుంటాడు. సరిగ్గా తాజాగా ఇలాగే కిమ్ తనపై కుట్ర పన్నిన వ్యక్తిని పిరాన్హా చేపలకు ఆహారంగా వేశాడని.. అయితే ఈ తరహాలో చంపడం కిమ్‌కు ఇదే కొత్త కాదని  డైలీ స్టార్ తెలిపింది. బ్రెజిల్ దేశం నుంచి  తన ఆక్వేరియం కోసం వందల పిరాన్హా చేపలను కిమ్ జోంగ్ ఉన్న దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మాంసాన్ని తినే ఈ పిరాన్హా చేపలు పదునైన రేజర్ దంతాలను కలిగి ఉంటాయి. వీటి సాయంతోనే  నిమిషాల్లో మాంసాన్ని చీల్చి తినేస్తుంటాయి.

2011లో నార్త్ కొరియా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన కిమ్ జోంగ్ ఉన్.. ఇప్పటి వరకు కొన్ని ఆరోపణల్లో 16 మంది కీలక అధికారులకు అత్యంత దారుణంగా మరణశిక్ష విధించాడు. జనరల్ అధికారి కంటే  ముందు ఇలాగే 2019లో తనపై తిరుగుబాటుకు కుట్ర పన్నాడని ఓ జనరల్‌ని ఉరి తీయించాడు. అంతేకాదు చిన్న చిన్న తప్పులకు కూడా  నార్త్ కొరియాలోని ప్రజలను.. పులులకు ఆహారంగా ఇవ్వడం, ఆకలితో ఉన్న కుక్కలకు వారిని ఎరగా వేయడం, వారి తలలు నరికి చంపడంతో పాటు ఒక్కోసారి బతికి ఉండగానే  దహనం చేయడం వంటి అత్యంత క్రూరమైన శిక్షలను   విధించడంలో కిమ్‌ను మించిన వాడు లేడన్న నెగిటివ్ టాక్‌ను మూటకట్టుకున్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =