మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఓ 45 నిమిషాలు కేటాయించండి..

Set aside 45 minutes to de stress,Set aside 45 minutes,45 minutes to de stress,Stress Management,Relaxation Techniques for Stress Relief,Mango News,Mango News Telugu, Colouring, Dancing, de-stress, drawing, Mental Stress, painting, Potting, Set aside 45 minutes to de-stress, Stress Levels,Techniques for Stress Relief,45 minutes to de stress News
Set aside 45 minutes to de-stress,de-stress, Mental Stress, Drawing, Painting, Dancing, Potting, Colouring, Stress Levels

ఇంటా, బయటా  ఒత్తిడితోనే  పని చేయడం ఇప్పుడు అందరిలో కామన్‌గా మారిపోయింది. ఇంటి సమస్యలు, ఆఫీసు ప్రాబ్లెమ్స్‌ సరిపోవన్నట్లుగా ఆరోగ్యంలో ఇబ్బందులతో జనాలు విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో మెంటల్ స్ట్రెస్‌కు గురై.. మానసికంగా అనారోగ్యం పాలవుతున్నారు. అయితే ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ లెవల్స్‌ను తగ్గించేందుకు 45 నిమిషాల ఆర్ట్ థెరపీ సరిపోతుందంటున్నారు  అంటున్నారు నిపుణులు. పెయింటింగ్, డ్యాన్స్, రైటింగ్, పాటరీ వంటి  కళల  ద్వారా దొరికే సానుకూల ప్రభావంతో కావాల్సినంత మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు.

మానసిక సమస్యలకు, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి 45 మినిట్స్ ఆర్ట్ థెరపీ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ది ఆర్ట్స్ ఇన్ సైకోథెరపీ వివరించిన దాని ప్రకారం.. మెంటల్ హెల్త్ రికవరీలో ఆర్టిస్టిక్ ఎక్స్‌ప్రెషన్  బాగా పని చేస్తుందని తేలింది. మనిషిలో కొత్త నైపుణ్యాలను పెంపొందించడంతో మెంటల్ హెల్త్‌ను బాగుపరచవచ్చు. అంటే  ఆర్ట్ థెరపీ అసలు ఉద్దేశమే.. ఆర్ట్ రూపంలో సొంత భావాలను వ్యక్తీకరించడం కాబట్టి.. తమలోని భావోద్వేగాలను వీళ్లు అన్వేషించగలుగుతారు. దీని ద్వారా స్ట్రెస్‌ను మేనేజ్ చేయడం నేర్చుకుంటారు.ఇంకా చెప్పాలంటే.. కొత్తగా ఒక కళను నేర్చుకోవడం, దానివల్ల అభినందనలు అందుకోవడం వల్ల వారిలో మానసికంగా ఉత్సాహాన్ని అందించడమే కాకుండా.. సామాజిక నైపుణ్యాలను పెంపొందించేలా చేస్తుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.

యాన్ ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ రీసెర్చ్, పాలసీ అండ్ ప్రాక్టీస్‌లో ఇటీవల ఓ అధ్యయనంలో మెంటల్ హెల్త్‌కు సంబంధించి కొన్ని విషయాలు ప్రచురించారు.  ఈ  అధ్యయనంలో.. కేవలం 45 నిమిషాల పాటు ఏదొక ఆర్ట్ సాధన చేయడం వల్ల.. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలు తగ్గుతున్నాయని గుర్తించారు పరిశోధకులు. తమ అధ్యయనం కోసం 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల వారిని ఎంచుకున్నారు. వారిలో 39 మంది ఆరోగ్యంగా ఉండే  పెద్దలు, 33 మంది మహిళలు, ఆరుగురు పురుషులపై  అధ్యయనం చేసి  ఫలితాలను వెల్లడించారు. ఇందులో ఆర్ట్ థెరపిస్ట్ నేతృత్వంలో 45 నిమిషాల పాటు  వ్యక్తిగత ఆర్ట్ మేకింగ్‌ నిర్వహించిన పరిశోధకులు.. వారిలో ఆర్ట్-మేకింగ్ సెషన్‌కు ముందు, సెషన్ తర్వాత వారిలో స్ట్రెస్‌ లెవల్స్‌ను గుర్తించారు. ఆర్ట్ మేకింగ్‌తో సెల్ఫ్ ఎఫిషియన్సీ, పాజిటివిటీ లెవల్స్ మెరుగవడం ద్వారా చాలావరకూ ఒత్తిడి తగ్గినట్లు తేలింది.

ఈ ఆర్ట్ థెరపీలో చాలా రకాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ వారికి  డ్యాన్స్ అంటే ఇష్టమయితే.. ఒత్తిడి స్థాయిలను తగ్గించేందుకు దానినే థెరపీగా ఉపయోగించుకోవచ్చంటున్నారు. భావోద్వేగ, సామాజిక, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచే పద్ధతుల్లో డ్యాన్స్ ముఖ్యమయినదిగా చెబుతున్నారు.  ఒత్తిడిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. 6 నెలల డ్యాన్స్ థెరపీ తర్వాత వారిలో ఒత్తిడి గణనీయంగా తగ్గిందని ది ఆర్ట్స్ ఇన్ సైకోథెరపీ చెబుతోంది.

డ్రాయింగ్ ,పెయింటింగ్, కలరింగ్ వంటివి ఇంట్రస్ట్ ఉంటే దాని వల్ల కూడా మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని అధ్యయనంలో తేలింది. మెదడును శాంతపరచడానికి, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి, ఒత్తిడిని తగ్గించడానికి పెయింటింగ్,  కలరింగ్ ఆరోగ్యకరమైన పద్థతులుగా చెబుతున్నారు. ఒత్తిడి తగ్గి..  నిద్రను ప్రేరేపించడంలో కూడా ఇవి సహాయపడతాయి. అమెరికన్ ఆర్ట్ థెరపీ అసోసియేషన్ జర్నల్‌లో.. ప్రతి రోజూ ఇలా ఏదొక ఆర్ట్‌పై దృష్టిని కేంద్రీకరిస్తే.. ఒత్తిడిని తగ్గిస్తుందని చెప్పింది.

అలాగే కుండలను తయారు చేయడాన్ని కూడా నేర్చుకోవచ్చు. దీనివల్ల  స్ట్రెస్ లెవల్స్‌ను తగ్గి మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. ఈ పాటరీ థెరపీ మనస్సును ప్రశాంత పరుస్తుంది. అంతేకాదు ఇప్పటికే కుండల తయారీ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. అందుకే  ఒంటరితనంతో  ఫీల్ అవుతున్న వారి కోసం ..పాటరీ థెరపీని అందుబాటులోకి తీసుకువచ్చారు.ఇప్పటికే చాలా సిటీల్లో వీకెండ్స్‌లో వీళ్లకోసం స్పెషల్ ఈవెంట్స్‌ కూడా అరేంజ్ చేస్తున్నారు.

అంతేకాదు.. మానసిక ఒత్తిడికి గురయినప్పుడు ..ఆ సమయంలో  ఎలా ఫీల్ అవుతున్నారనే దానిని అక్షరాల  రూపంలో రాసి పెట్టుకుంటే చాలా వరకూ ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు వారి వారి భావోద్వేగాలను కాగితంపై ఉంచడంతో తమ మనసులోని బాధను వేరే వాళ్లతో పంచుకున్న భావన కలుగుతుంది. దీంతో ఇది ఒత్తిడిని చాలా వరకూ తగ్గిస్తుంది. హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్  కూడా ఇదే చెప్పింది.  జీవితంలో ఒత్తిడితో కూడిన సమయంలో వచ్చిన ..ఆ  ఆలోచనలు, భావాలను రాయడం సమస్యను తగ్గించడానికి ఎంతో హెల్ప్ చేస్తుందని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 8 =