దూసుకెళ్తున్న బీఆర్ఎస్.. తెలంగాణ ఇంటెన్షన్స్ సర్వే నివేదికలో సంచలన విషయాలు

Congress graph down Sensational things in Telangana intentions survey report,Congress graph down Sensational things,Sensational things in Telangana,Telangana intentions survey report,Mango News,Mango News Telugu,Telangana Survey,TS Politics,Survey predicts hung Assembly,Telangana Congress Graph Increasing,bjp, BRS, Congress, telangana, Telangana Assembly Elections,Congress graph down Latest News,Congress graph down Latest Updates,Congress graph down Live News,Telangana survey report Latest News,Telangana survey report Latest Updates,Telangana survey report Live News, Telangana Political News And Updates
telangana, telangana assembly elections, brs, bjp, congress

తెలంగాణలో ఎన్నికల హవా కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ కూడా రావడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలకు కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగ పరుచుకుంటూ ప్రధాన రాజకీయ పార్టీలన్ని ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి.  మొన్నటి వరకు అనారోగ్య సమస్యలతో ఇంటిపట్టునున్న కేసీఆర్ కూడా ఎన్నికల కదణరంగంలోకి దూకేశారు. వరుసగా బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అటు అభ్యర్థుల ఎంపిక విషయంలో తలామునకలయిన కాంగ్రెస్.. ఎట్టకేలకు 55 మందితో తొలి జాబితాను ప్రకటించేసింది. ఇక అనూహ్యంగా వెనుకబడిపోయిన బీజేపీ.. తిరిగి ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమే అవుతున్నాయి.

ప్రతివారంలానే ఈవారం కూడా తెలంగాణ ఇంటెన్షన్స్ సర్వే నివేదిక వచ్చేసింది. రాష్ట్రంలో అన్ని పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్ ముందంజలో దూసుకెళ్తోంది. అటు కాంగ్రెస్ గ్రాఫ్ మాత్రం రెండు వారాలుగా డౌన్ ఫాల్ వైపు చూస్తోంది. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ లేట్ చేయడమే గ్రాఫ్ పడిపోవడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అటు బీజేపీ గ్రాఫ్ కూడా యథాతథంగా కొనసాగుతోంది.  మొన్నటి వరకు తగ్గుతూ పోయిన బీజేపీ గ్రాఫ్.. పోయినవారం మోడీ ప్రసంగంతో కాస్త పెరిగింది. ఈవారం మాత్రం ఎటువంటి మార్పులేదు.

ఇక ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్‌కు 40 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని నివేదికలో తేలింది. కాంగ్రెస్ గ్రాఫ్ మాత్రం కాస్త తగ్గింది. పోయినవారం కాంగ్రెస్‌కు 34 శాతం ఓట్లు పడే అవకాశం ఉండగా.. అది ఈవారం 1 శాతం తగ్గింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 33 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది. అటు బీజేపీ గ్రాఫ్‌లో ఎటువంటి ఛేంజ్ లేదు. పోయిన వారంలానే.. ఈవారం కూడా బీజేపీకి 10 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని నివేదికలో వెల్లడయింది.

ఇక రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశం 7 శాతం ఉందని నివేదికలో తేలింది. పోయినవారం కూడా హంగ్ ఏర్పడే అవకాశం 7 శాతమే ఉంది. ఇక బీఆర్ఎస్‌కు కాకుండా.. బీజేపీ లేదా కాంగ్రెస్‌కు పడే ఓట్లు 9 శాతంగా ఉన్నట్లు నివేదిక చెబుతోంది. పోయిన వారం ఈ ఓట్లు 10 శాతంగా ఉండగా.. ఈవారం ఒక శాతం ఓట్లు తగ్గాయి. ఇకపోతే తాము ఓటు వేయబోయే పార్టీ గెలుస్తుందనే నమ్మకం 78 శాతం మంది ఓటర్లలో ఉన్నట్లు నివేదికలో తేలింది. అలాగే 93 శాతం మంది బీఆర్ఎస్ ఓటర్లు తమ పార్టీ గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నట్లు నివేదికలో స్పష్టమయింది. కాంగ్రెస్ ఓటర్లు 68 శాతం మంది.. బీజేపీ ఓటర్లు 45 శాతం మంది వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్లు నివేదికలో తేలింది. అన్ని పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్ ఓటర్లలోనే తమ పార్టీ గెలుస్తుందనే నమ్మకం ఎక్కువగా ఉన్నట్లు ఈ నివేదిక ప్రకారం స్పష్టంగా అర్థమవుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 9 =