వరల్డ్​ కప్​​ గురించి మీకీ సంగతులు తెలుసా?

Do you know about the World Cup,about the World Cup,Do you know World Cup,Mango News,Mango News Telugu,ICC World Cup Price,ICC World Cup History,When and who made the World Cup, How much does the World Cup cost,ICC World Cup,World Cup,World Cup cost,about the World Cup News Today,World Cup Latest News,World Cup Latest Updates,ICC World Cup Latest News

వన్డే ప్రపంచకప్​‌కు ఇంకొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. క్రికెట్​ అభిమానులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే వన్డే ప్రపంచ కప్‌ను ముద్దాడేందుకు 10 జట్లు హోరా హోరీగా బరిలో తలపడనున్నాయి.ఒకే ఒక జట్టును మాత్రమే వరించే కప్పుకోసం టఫ్ వారే నడుస్తుంది. మరోవైపు ఛాంపియన్స్‌గా నిలిచే జట్టుకు బహుకరించే ఈ ట్రోఫీ హిస్టరీ, దాన్ని ఎవరు రూపొందించానే విషయాల గురించి చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది.

ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జరిగే ప్రపంచకప్​ కోసం క్రికెట్​ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు.అలాగే ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడాలని ప్రతీ జట్టు ఎన్నో కలలు కంటుంది. దీనికోసం పది జట్లు బరిలోకి దిగుతాయి. తాజాగా ఇప్పుడు రాబోతున్న ఈ మెగా టోర్నీకి భారత్‌ వేదికవడంతో క్రికెట్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 5న ఢిపెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లాండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ వన్డే ప్రపంచకప్‌ ఆరంభం కానుంది.

వరల్డ్​ కప్​ టూర్​‌లో భాగంగా ప్రపంచాన్ని చుట్టొస్తున్న ప్రపంచ కప్​ తాజాగా.. హైదరాబాద్‌లో సందడి చేయడంతో దీనిని చూడటానికి భాగ్యనగరవాసులు పోటీ పడ్డారు. రామోజీ ఫిల్మ్​ సిటీ, చార్మినార్‌, ఇన్​ఆర్బిట్​ మాల్​, ఉప్పల్ స్టేడియం, హుస్సేన్‌ సాగర్‌ వంటి ప్రముఖ సందర్శనీయ స్థలాల్లో ప్రపంచ కప్ ట్రోఫీ కనువిందు చేసింది. దీంతో అసలు ఛాంపియన్స్‌గా నిలిచే జట్టుకు బహుకరించే ట్రోఫీ హిస్టరీ, దాన్ని ఎవరు రూపొందిచారన్న విషయాల గురించి అందరికీ తెలుసుకోవాలని కూతూహలం పెరిగిపోయింది.

1975లో వన్డే ప్రపంచకప్‌ ప్రయాణం మొదలైంది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డే వరల్డ్‌కప్‌ను.. వెస్టిండీస్‌ జట్టు కైవసం చేసుకుని రికార్డుకెక్కింది. అయితే ఈ టోర్నీ ఐసీసీ ఆధ్వర్యంలో జరిగినా కూడా.. దానికి ‘ప్రుడెన్షియల్ వరల్డ్‌కప్‌’ అని పేరు పెట్టారు. ప్రుడెన్షియల్ అనే బీమా కంపెనీ తొలి వరల్డ్‌కప్‌ స్పాన్సర్‌గా వ్యవహరించడంతో ఆ వరల్డ్ కప్‌నకు ఆ పేరు పెట్టారు.

వెండి, బంగారం కలయికతో మొట్టమొదటిగా ప్రపంచ కప్​ రూపొందింది. ట్రోఫీ పైభాగంలో బంగారు పూతతో తయారు చేసిన ఓ క్రికెట్‌ బాల్​‌ను దీనికి అమర్చారు. 1979, 1983 ప్రపంచకప్​‌ను కూడా ప్రుడెన్షియల్ బీమా కంపెనీనే స్పాన్సర్‌ చేసింది. ఈ సమయంలో 1979 వన్డే ప్రపంచకప్‌ను రెండో సారి కూడా విండీస్‌ కైవసం చేసుకోగా.. 1983 కప్‌ను భారత జట్టుట జట్టు ముద్దాడింది.

ఆ తర్వాత 1987 వరల్డ్‌కప్​‌నకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టైటిల్‌ స్పాన్సర్‌గా ఎంపికైంది. దీంతో ఆ 1987లో మెగా ఈవెంట్‌ను రిలయన్స్‌ కప్‌గా పిలిచారు. వెండి, బంగారం కలయికతోనే ఈ కప్‌ను కూడా రూపొందించారు. ప్రుడెన్షియల్ కంపెనీలా రిలయన్స్‌ కూడా ట్రోఫీలో క్రికెట్ బాల్‌నే అమర్చింది. ఆ ఏడాది మాత్రం ఆస్ట్రేలియా జట్టు తొలి వరల్డ్‌కప్‌ను అందుకుంది.

రిలయన్స్‌ కేవలం 1987లో జరిగిన ఒక్క వరల్డ్‌ కప్‌నకు మాత్రమే టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఆ తర్వాత 1992 ప్రపంచకప్‌నకు బెన్సన్ అండ్‌ హెడ్జెస్ అనే బ్రిటీష్‌ సిగిరెట్‌ కంపెనీ టైటిల్‌ను స్పాన్సర్​ చేసింది. దీంతో 1992లో జరిగిన టోర్నీని బెన్సన్ అండ్‌ హెడ్జెస్ వరల్డ్‌కప్‌ అని పిలిచారు.అయితే ఆ ఏడాది ఆ కప్​‌ను పాకిస్థాన్​ జట్టు కైవసం చేసుకుంది.

బెన్సన్ అండ్‌ హెడ్జెస్ కంపెనీ తర్వాత.. 1996 వన్డే ప్రపంచకప్‌కు విల్స్‌ అనే మరో సిగిరెట్‌ కంపెనీ టైటిల్‌ స్పాన్సర్‌గా మారింది. దీంతో ఆ టోర్నీని విల్స్ వరల్డ్ కప్ అని పిలిచారు. 1996లో విల్స్​ కప్‌ను శ్రీలంక గెలుచుకుంది. అయితే 1996 ప్రపంచ కప్​ తర్వాత ఐసీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 1999 వరల్డ్‌ కప్‌ కోసం ఐసీసీ సంస్థ ఓ కొత్త ట్రోఫీని ప్రవేశ పెట్టి..దానిని తయారు చేసే బాధ్యతలను లండన్‌లోని గారార్డ్ అనే ప్రముఖ జ్యువెలరీ సంస్థకు అప్పజెప్పింది. అప్పుడు ఆ కప్‌ను రూపొందించడానికి రెండు నెలల సమయం పట్టింది. వెండితో తయారైన ఈ ట్రోఫీకి పైనుంచి బంగారు పూత పూశారు.

సుమారు 60 సెంటీమీటర్ల ఎత్తుతో ఉన్న ప్రపంచ కప్ ట్రోఫీ పైన గోల్డెన్​ కలర్‌లో ఓ గ్లోబ్‌ను ..సపోర్ట్‌గా మూడు సిల్వర్ కాలమ్స్​ ను అమర్చారు. ఆ కాలమ్‌లు స్టంప్‌లు, బెయిల్స్‌ రూపంలో నిలువుగా ఉంటాయి. క్రికెట్‌లో కీలకం అయిన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ ఇలా మూడు అంశాలను ప్రతిబింబించేలా ప్రపంచ కప్ ట్రోఫీని తయారు చేశారు.అలాగే పైనున్న గ్లోబ్‌ క్రికెట్‌ బంతిని సూచిస్తుంది. ఈ ట్రోఫీని ప్రత్యేక కొలతలతో ప్రత్యేక శ్రద్దతో తయారు చేశారు. సుమారు 11 కిలోల బరువు ఉండే ఈ కప్​ ఏ కోణం నుంచి చూసినా కూడా ఈ ట్రోఫీ ఒకే విధంగా ఉండేలా తయారు చేశారు.

క్రికెట్ అభిమానులు​ ప్రతిష్టాత్మకంగా భావించే ప్రపంచ కప్​ ట్రోఫీ తయారీకి.. 40వేల పౌండ్లు ఖర్చు చేసింది ఐసీసీ . అంటే ఇండియాలో ఉన్న ప్రస్తుత ​ ధరల ప్రకారం దీని ధర సుమారు రూ.30,85,320. వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచిన జట్టుకు ప్రపంచ కప్ ట్రోఫీని అందిస్తారు. అలాగే విన్నర్​ జట్టు పేరును ఈ ట్రోఫీ కింద ముద్రిస్తారు. అయితే ఒరిజినల్ ట్రోఫీని మాత్రం గెలిచిన జట్టుకు ఇవ్వకుండా… దాన్ని పోలిన నకలును మాత్రమే అందజేస్తారు. ఒరిజనల్​ ట్రోఫీని దుబాయ్‌లోని తమ ఆఫీస్‌​లో ఉంచుతుంది ఐసీసీ.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + twenty =