గరుడసేవకు గొడుగులు వచ్చేసాయ్..

The specialty of Chennai umbrellas in Tirumala Brahmotsavam,The specialty of Chennai umbrellas,umbrellas in Tirumala Brahmotsavam,Chennai umbrellas in Tirumala Brahmotsavam,Mango news,Mango News Telugu,brahmotsavam,Tirumala,brahmotsavam,garudaseva,Umbrellas come for Garudaseva, The specialty of Chennai umbrellas ,Brahmotsavam umbrellas,Chennai umbrellas in Tirumala News Today,Chennai umbrellas in Tirumala Latest News,Chennai umbrellas in Tirumala Latest Updates,Tirumala Brahmotsavam Latest News,Tirumala Brahmotsavam Latest Updates

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ.. అశేష భక్త జనం మధ్య, తిరుమల మాడవీధులు గోవింద నామ స్మరణలతో మారుమోగుతుంటే.. ఆ దృశ్యం చూసే ప్రతి భక్తుడికి మనసు, శరీరం రెండూ పులకరించిపోతాయి. అయితే తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టే గొడుగులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అశేష భక్త జన సంద్రం మద్య రథంపై ఊరేగే శ్రీవారికి.. అసలు గొడుగులు ఎందుకు పడతారని కొంతమంది భక్తులలో సందేహం కూడా వస్తుంటుంది.

నిజానికి ఈ గొడుగులకు చాలా ప్రత్యేకత ఉంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే అందులో గరుడసేవ చాలా ముఖ్యమైనదిగా అంతా భావిస్తారు. ఈ గరుడ సేవలో వినియోగించే గొడుగులు చెన్నై నుంచి తయారై వస్తాయి. పూర్వం నుంచీ కూడా గరుడసేవ కార్యక్రమాన్ని ఎంతో భక్తిశ్రద్దలతో నిర్వహించి..శ్రీవారిని మనసారా పూజిస్తుంటారు. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజు భక్తులు విపరీతంగా వచ్చి అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడికి బ్రహ్మరథం పడతారు.అలా గరుడ సేవకు వాడే చెన్నై గొడుగులు తిరుమలలోని శ్రీవారి కోసం తిరుమలకు చేరుకున్నాయి.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ..గరుడసేవ రోజు తిరుమల శ్రీవారికి అలంకరించేందుకు చెన్నై నుంచి తొమ్మిది గొడుగులను ఊరేగింపుగా నిన్న అంటే సెప్టెంబర్ 21న హిందూ ధర్మార్థ సమితి తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ ఆర్‌.ఆర్‌.గోపాల్‌జీ ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న ఆ గొడుగులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం కూడా పలికారు.

శ్రీవారి ఆలయం ముందు చెన్నై నుంచి తీసుకు వచ్చిన గొడుగులను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందించారు. నాలుగు మాడ వీధుల్లో గొడుగులను ఊరేగించిన తర్వాత ఆలయంలోకి ఆ గొడుగులను తీసుకెళ్లారు. గరుడసేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు. అయితే తాము ఈనెల 16న చెన్నైలో బయలుదేరామని.. ఈ పదకొండు గొడుగులను ఊరేగిస్తూ..మధ్యలో తిరుచానూరులో పద్మావతి అమ్మవారికి 2 గొడుగులు సమర్పించి..మిగిలిన 9 గొడుగులతో గురువారం సాయంత్రానికి తిరుమలకు చేరుకున్నామని సమితి ట్రస్టీ ఆర్‌.ఆర్‌.గోపాల్‌జీ చెప్పారు.

ప్రతి ఏడాది తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు.. గొడుగులను తీసుకువచ్చే ముందు చెన్నైలోని చెన్నకేశవ పెరుమాళ్ గుడిలో ఈ గొడుగులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే తిరుమలకు తీసుకువచ్చే 11 గొడుగుల్లో రెండు గొడుగులను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి 2 గొడుగులను సమర్పించాకే మిగిలిన 9 గొడుగులను తిరుమలకు తీసుకువస్తారు. 19 సంవత్సరాలుగా తిరుమల శ్రీవారికి గరుడ సేవ రోజు శ్రీవారికి అలంకరించడానికి హిందూ ధర్మార్థ సమితి ఈ గొడుగులను తయారుచేసి శ్రీనివాసుడికి సమర్పిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eighteen =