నేడు బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్న సౌరవ్ గంగూలీ

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, board of control for cricket in india, Ex Captain Sourav Ganguly To Take Over As BCCI President, Ex-India Captain Sourav Ganguly To Take Over As BCCI President, latest sports news, latest sports news 2019, Mango News Telugu, Sourav Ganguly As BCCI President, Sourav Ganguly To Take Over As BCCI President, sports news

భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. అక్టోబర్ 23, బుధవారం నాడు బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ మినహా మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా బోర్డు పగ్గాలు చేపట్టడం లాంఛనమే కానుంది. సమావేశం అనంతరం బీసీసీఐ నూతన కార్యవర్గం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది.

అదేవిధంగా ఇన్ని రోజులు బీసీసీఐ వ్యవహారాలు నడిపించిన సుప్రీం కోర్టు నియమిత పాలక కమిటీ సభ్యులైన వినోద్‌ రాయ్, డయానా ఎడుల్జీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. వారు పనిచేసిన 33 నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ.3.5 కోట్లు చెల్లించాలని బీసీసీఐ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. సౌరవ్ గంగూలీ తో పాటు బీసీసీఐ కార్యదర్శిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా, బోర్డు కోశాధికారిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడైన అరుణ్‌ ధుమాల్‌ బాధ్యతలు చేపట్టబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eleven =